అలా జరగకుంటే అత్యాచారం కాదు: హైకోర్టు

Date:


India

oi-Jakki Mahesh

ఓ అత్యాచార కేసులో ఛత్తీస్‌గఢ్ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నేరానికి సంబంధించి హైకోర్టు ఓ చట్టపరమైన వివరణ ఇచ్చింది. అత్యాచారం జరిగిందని నిర్ధారించడానికి అంగప్రవేశం తప్పనిసరి అని.. కేవలం వీర్య విసర్జన జరిగినంత మాత్రాన దానిని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు 20 ఏళ్ల నాటి కేసులో నిందితుడి శిక్షను తగ్గిస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

అసలేం జరిగిందంటే?
ఈ అత్యాచార కేసు 2004 మే 21న జరిగింది. నిందితుడు ఓ మహిళను బలవంతందా తన ఇంటికి తీసుకెళ్లి.. వస్త్రాలను లాగేసి ఆమై లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ కేసులో 2005లో ట్రయల్ కోర్టు నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అప్పీల్‌ను విచారించిన జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ధర్మాసనం.. బాధితురాలి సాక్ష్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. బాధితురాలు క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఒకసారి నిందితుడు అంగప్రవేశం చేశాడని.. మరోసారి ప్రవేశం చేయలేదని పొంతన లేని సమాధానాలు ఇచ్చింది.”బాధితురాలి సాక్ష్యాన్ని పరిశీలిస్తే అత్యాచారం జరిగినట్లు ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఆమె స్టేట్‌మెంట్లు అనుమానాలకు తావిస్తున్నాయి” అని కోర్టు అభిప్రాయపడింది.

వైద్య నివేదిక ఏం చెబుతోంది?
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కూడా బాధితురాలి ప్రైవేట్ పార్టు పొర చెక్కుచెదరలేదని తెలిపారు. కేవలం పాక్షికంగా అంగప్రవేశం చేసే అవకాశం ఉందని.. కానీ అత్యాచారం జరిగిందని ఖచ్చితంగా చెప్పలేమని వెల్లడించారు. ఈ ఆధారాలను బట్టి ఇది “అత్యాచార ప్రయత్నం” (Attempt to కిందకు వస్తుందే తప్ప, పూర్తిస్థాయి అత్యాచారం కాదని కోర్టు తేల్చి చెప్పింది.

శిక్ష తగ్గింపు
ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం.. అత్యాచారం రుజువు కావాలంటే స్వల్పస్థాయిలోనైనా అంగప్రవేశం జరగాలి. ఈ కేసులో అది నిరూపితం కానందున.. నిందితుడిపై ఉన్న సెక్షన్ 376 (అత్యాచారం)ను సెక్షన్ 511 (నేర ప్రయత్నం)కు మారుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను మూడున్నరేళ్లకు మారుస్తూ హైకోర్టు సవరించింది. నిందితుడు ఇప్పటికే కొంతకాలం జైలులో ఉన్నందున.. మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించడానికి రెండు నెలల్లోపు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related