హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ | Justice Ravinath Tilhari appointed as Chairman of AP High Court Legal Services Committee

Date:


సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ నామినేట్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. హైకోర్టులో సీనియారిటీలో 3వ స్థానంలో ఉన్న న్యాయ­మూర్తి హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది.

లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ పోస్టుకు జస్టిస్‌ తిల్హరీని ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ నామినేట్‌ చేశారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ఉన్నారు. 



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related