Entertainment
oi-Kannaiah
కార్తీకదీపం
2
సీరియల్లో
గత
ఎపిసోడ్
(533వ
ఎపిసోడ్)
లో
దీప
తన
ఇష్ట
ప్రకారమే
కార్తీక్‌తో
పాటు
దశరథ
ఇంటికి
వెళ్లకుండా
ఉండాలని
మొండిగా
నిర్ణయం
తీసుకుంది.
శివన్నారాయణ
కుటుంబం
దీపకు
లీవ్
ఇచ్చి
వెళ్లిపోయిన
తర్వాత,
కాంచన
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
“ఈ
బిడ్డ
ఉంటే
ఎంత?
పోతే
ఎంత
అన్నట్లుగా
ఉంటున్నావు”
అని
దీపను
నానా
మాటలు
అని
బాధించింది.
మరోవైపు,
శ్రీధర్
తన
కొత్త
పీఏ
కాశీని
తీవ్రంగా
విసిగిస్తున్నాడు.మరి
డిసెంబర్
6వ
తేదీ
(534వ
ఎపిసోడ్)
లో
జ్యోత్స్న
వేసిన
ప్లాన్
ఎలా
బెడిసికొట్టింది,
శౌర్యకు
నిజం
ఎలా
తెలిసిందో
కింద
చూడవచ్చు.
కాంచన
కన్నీటి
బాధ,
శివన్నారాయణ
నిర్ణయం
దీప
గర్భానికి
శౌర్య
కాలు
తగిలిన
విషయాన్ని
ప్రస్తావిస్తూ,
“నాకెంత
విలువ
ఉందో
ఇప్పుడే
అర్ధమవుతోంది”
అని
కాంచన
కార్తీక్,
దీపలపై
పరోక్షంగా
తన
బాధను
వెల్లగక్కింది.
“నువ్వు
కూతురికి
చెప్పుకోలేవు,
భార్యకు
చెప్పుకోలేవు..
నువ్వు
నా
మాట
వినడం
లేదు”
అంటూ
కన్నీరు
పెట్టుకుంది.
మరోవైపు,
ఇంట్లో
జరిగిన
గొడవ
గురించి
అనసూయ
దీపతో
మాట్లాడి,
అనవసరంగా
శివన్నారాయణ
కుటుంబాన్ని
బాధ
పెట్టొద్దని
హితవు
పలికింది.
పెళ్లి
వెనుక
చేదు
నిజం
చెప్పిన
జ్యోత్స్న
పెళ్లికి
ఒప్పుకున్నందుకు
శివన్నారాయణ
సంతోషంగా
స్వీట్స్
తెమ్మనగా,
“ఈ
తీపి
వెనుక
ఓ
చేదు
నిజం
ఉంది”
అంటూ
జ్యోత్స్న
షాక్
ఇచ్చింది.
“నేను
పెళ్లికి
ఒప్పుకోవడం
ఇదే
మొదటిసారి
కాదు,
అయినా
మనవాళ్లు
ఎందుకు
సంతోషిస్తున్నారో
తెలుసా?”
అని
ప్రశ్నించింది.
“మనకి
కావాల్సిన
వాళ్లు
మనతో
ఉండాలని
కోరుకున్నప్పుడు
దానికి
అడ్డుగా
ఉన్న
వారిని
ఏదో
ఒక
రకంగా
తప్పించాలని
కోరుకుంటారు.
అడ్డుగా
ఉన్న
వ్యక్తి
కూతురైతే
ఇలాగే
పద్ధతిగా
గెంటేస్తారు”
అని
జ్యోత్స్న
మండిపడింది.
దీపకు
చిన్న
ప్రాబ్లమ్
వస్తే
ఫ్యామిలీ
అంతా
ఆ
ఇంటికి
వెళ్లాల్సిన
అవసరం
ఏమొచ్చిందని
నిలదీసింది.
పారిజాతానికి
శివన్నారాయణ
మాస్టర్
స్ట్రోక్
జ్యోత్స్న
ప్రశ్నలకు
పారిజాతం
కూడా
వత్తాసు
పలకడంతో
శివన్నారాయణ
స్పష్టమైన
సమాధానం
ఇచ్చారు.
“నా
మనవరాలు
కడుపుతో
ఉంటే
ఏమేం
చేస్తానో
అవన్నీ
దీపకి
చేస్తాను.
దీప
కడుపులో
పెరుగుతున్న
బిడ్డ
మీద
నా
కూతురికి
నమ్మకం
ఉంది,
నా
బిడ్డ
మీద
నాకు
ప్రేమ
ఉంది.
నా
కూతురి
కోడలి
కోసం
నేను
అన్నీ
చేస్తాను!”
అని
తేల్చిచెప్పారు.
ఈ
మాటలతో
పారిజాతం,
జ్యోత్స్నల
ప్లాన్
పూర్తిగా
బెడిసికొట్టింది.
శౌర్యకు
నిజం
తెలిసింది,
సుమిత్రకు
అస్వస్థత
సుమిత్ర,
దశరథలు
తమ
కూతురు
జ్యోత్స్న
ప్రవర్తనపై
ఆవేదన
వ్యక్తం
చేశారు.
“పెళ్లి
చేసి
దూరంగా
పంపించేద్దాం”
అని
సుమిత్ర
చెప్పగా,
కార్తీక్
ఇంకా
అగ్రిమెంట్
క్యాన్సిల్
చేయకుండా
ఉండడం
వెనుక
ఏదో
రహస్యం
ఉందని
సుమిత్ర
అనుమానం
వ్యక్తం
చేసింది.
ఈ
చర్చ
జరుగుతుండగా
సుమిత్రకు
ఉన్నట్లుండి
తల
తిరిగి
కిందపడిపోయింది.
డాక్టర్
దగ్గరికి
వెళ్లాలని
దశరథ
అడిగినా
ఆమె
నిరాకరించింది.
మరోవైపు,
శౌర్యను
నానమ్మ
దగ్గర
పడుకోమ్మని
కార్తీక్
చెప్పగా,
శౌర్యకు
పారిజాతం
చెప్పిన
చెప్పుడు
మాటలు
గుర్తొచ్చి
ఏడుస్తుంది.
“నువ్వు
మారిపోతావని
జో
గ్రానీ
ముందే
చెప్పింది”
అని
శౌర్య
అనడంతో,
పారిజాతం
కుట్ర
కార్తీక్‌కు
అర్ధమవుతుంది.
నొప్పితో
ఏడుస్తున్న
శౌర్య
దగ్గరికి
వెళ్లి
“రాత్రి
నువ్వు
బుజ్జిబాబుని
కొట్టావు”
అని
కార్తీక్
చెప్పడంతో,
తన
చర్య
వల్ల
అమ్మకు
నొప్పి
వచ్చిందని
శౌర్య
బాధపడింది.తండ్రి
మాటకు
షాక్
అయిన
పారిజాతం,
జ్యోత్స్నలు
తమ
కుట్రను
ఎలా
కొనసాగిస్తారు?
సుమిత్ర
అనారోగ్యం
ఎలాంటి
పరిణామాలకు
దారి
తీస్తుంది?


