తమిళనాడు పోల్స్.. విజయ్ పోటీ అక్కడినుంచే..!

Date:


India

oi-Bomma Shivakumar

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆధ్వర్యంలో టీవీకే పార్టీ తొలిసారిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు అధికారాన్ని కాపాడుకునే పనిలో డీఎంకే పార్టీ శ్రమిస్తోంది. ఇక అన్నాడీఎంకే- బీజేపీ కూటమి సైతం ఈసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

అయితే టీవీకే అధ్యక్షుడు విజయ్ కు టీవీకే పార్టీ నేతలు, కార్యకర్తలు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. అదేంటంటే..? విజయ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న తరుణంలో పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 22 న జరిగిన టీవీకే పార్టీ క్యాడర్ మీటింగ్ లో నేతలు, కార్యకర్తలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సమావేశంలో టీవీకే పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజ్ మెంట్ సెక్రటరీ ఆధవ్ అర్జున ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ మాట్లాడూతూ..” మేము ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించాం. ఈ మేరకు టీవీకే పార్టీ అధినేత విజయ్ కు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

అధిక పేదరికం ఉన్న ప్రాంతం నుంచి పార్టీ అధికార యంత్రాంగం పోటీ చేయాలని పార్టీ తీర్మానించింది. నార్త్ చెన్నై ప్రాంతంలో ఈ సమస్య అధికంగా ఉంది. అందువల్ల పార్టీ అధినేత విజయ్.. నార్త్ చెన్నైలోని పెరంబూర్, కోలత్తూర్, ఆర్కే నగర్ లో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు టీవీకే పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజ్ మెంట్ సెక్రటరీ ఆధవ్ స్పష్టం చేశారు. అలాగే ఇప్పటినుంచి చెన్నై టీవీకే పార్టీకి చెందినది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు అధికార డీఎంకే పార్టీకి పరోక్షంగా చురకలు అంటించారు.

ఇక దళపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీ నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఎన్నికల తర్వాతే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related