వైసీపీలో చేరిక పై తేల్చేసిన వంగవీటి ఆశాలత, టార్గెట్ ఫిక్స్..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ మధ్య సాగుతున్న పొలిటిల్ వార్ కొత్త మలుపు తీసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దీనికి కౌంటర్ గా జగన్ తన కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఇక, కొంత కాలం గా వంగవీటి కుమార్తె ఆశాలత పొలిటికల్ నిర్ణయాల పైన చర్చ జరుగుతోంది. అటు తాజాగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే ఆశాలత తాను వైసీపీలో చేరటం తో పాటుగా తన టార్గెట్ ఏంటో తేల్చి చెప్పారు.

వంగవీటి ఆశాలత రాజకీయ భవిష్యత్ పైన స్పష్టత ఇచ్చారు. వంగ‌వీటి మోహ‌న్ రంగా కుటుంబం నుంచి ఆయన కుమార్తె ఆశా కిర‌ణ్ రాజ‌కీయ‌ అరంగేట్రం పై కొంత కాలంగా చర్చ సాగుతోంది. ఆశా అడుగుల వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. తాను ప్రస్తుతానికి ప్ర‌జాసేవ‌కు ప‌రిమితం అవుతాన‌ని గతంలోనే వెల్లడించారు. రాధా-రంగా మిత్ర మండ‌లిలో చోటు చేసుకున్న గ్యాప్ కార‌ణంగానే తాను వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

తన తండ్రి ఏ కులానికో, మతానికో పరిమితం కాలేదని, ఆయన బాటలోనే తాను కూడా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని ఆమె స్పష్టం చేసారు. ఆ తరువాత తన తండ్రి అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి వీలుగా రంగం సిద్దం చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో వంగవీటి రాధా టీడీపీ లో కొనసాగుతున్నా.. ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. దీంతో.. ఆశా లతా తీసుకొనే రాజకీయ నిర్ణయం పైన అనేక రకాల విశ్లేషణలు వచ్చాయి.

భవిష్యత్ కార్యాచరణ ఫిక్స్

కాగా, ఇప్పుడు ఆశాలత వైసీపీలో చేరే అంశం పైన తేల్చి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా తాము వైసీపీ లో చేరుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. మార్కాపురం జిల్లాలోని చారిత్రక కంభం చెరువును సందర్శించారు. తాను రాష్ట్రవ్యాప్తంగా రాధా, రంగా మిత్రమండలిని ఏకతాటిపైకి తెచ్చి బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాను అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సమయం ఉందని చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అభిమానుల అభిప్రాయం మేరకే ఉంటుందని తేల్చి చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా తాను పర్యటిస్తానని.. బీసీలు, విద్యార్థుల్ని కలిసి రాధా రంగా మిత్రమండలిని మరింత బలోపేతం చేస్తానన్నారు. అయితే, తాను ఏ పార్టీలో చేరేది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్న ఆశాలతా.. ఏదో పార్టీలో మాత్రం చేరుతారనే చర్చ ఇంకా సాగుతోంది. దీంతో.. ఇప్పుడు అశాలత విజయవాడ కేంద్రంగా నిర్వహించే కార్యక్రమాలు.. భవిష్యత్ కార్యాచరణ పైన ఆసక్తి నెలకొంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related