పెన్షన్ల పెంపు..అమలు పై ప్రభుత్వం కొత్త ఫార్ములా – మార్గదర్శకాలు, ఎవరికి ఎప్పుడు..!!

Date:


Telangana

oi-Sai Chaitanya

తెలంగాణ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్దమైంది. చేయూత పెన్షన్లు పెంపు పైన కొత్త ఫార్ములా ఆలోచన చేస్తోంది. హామీ అమలు చేస్తూనే.. ఒకే సారి ప్రభుత్వం పైన ఆర్దిక భారం పడకుండా కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎన్నికల సమయంలో చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఆలోచనల మేరకు ఈ హామీ అమలు పైన బడ్జెట్ లో స్పష్టత ఇచ్చేలా కసరత్తు సాగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ పెంపు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా.. పింఛను మొత్తాన్ని విడతల వారీగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ రోగులు, డయాలసిస్‌ రోగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.4016 చొప్పున పింఛను ఇస్తోంది. అయితే, ఎన్నికల సమయంలో చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కాగా, పెన్షన్ల పెంపు నిర్ణయం అమల్లోకి తెస్తే.. భారీగా ఆర్దిక భారం పెరిగే అవకాశం ఉండటంతో.. కొత్త ఫార్ములా పైన కసరత్తు చేస్తున్నారు. విడతల వారీగా అమలు చేయటం ద్వారా లబ్దిదారుల్లో కొంత మేర సానుకూలత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విడతలవారీగా పెంచితే.. తొలి విడతలో రూ.500 పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని సమాచారం.

బడ్జెట్ లో స్పష్టత ఇచ్చే విధంగా కసరత్తు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, సన్నబియ్యం వంటి హామీలను అమలులోకి తెచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి సారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పింఛను అందుతోంది. ఇందుకోసం ప్రతి నెలా రూ.950 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఈ పింఛన్‌ను ప్రస్తుతానికి రూ.500 చొప్పున పెంచితే.. నెలకు సుమారు రూ.210 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే ఏడాదికి రూ.2500 కోట్లకు పైగా భారం ప్రభుత్వంపై పడనుంది. దీనిపై తుది నిర్ణయానికి వచ్చాక బడ్జెట్‌లో కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. తొలి విడతలో పెంచాలని భావిస్తున్న మొత్తాన్ని కూడా కలిపి బడ్జెట్‌లో కేటాయింపులు చేసే విధంగా కసరత్తు కొనసాగుతోంది. చేయూత ఫించన్లను ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి రూ.4 వేలకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నారు. దీని పైన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చేలా కార్యాచరణ సిద్దం అవుతోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related