Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
గతేడాది
అసెంబ్లీ
ఎన్నికల్లో
ఘన
విజయంతో
అధికారం
అందుకున్న
కూటమి
ప్రభుత్వం
ఏడాదిన్నర
పాలన
పూర్తిచేసుకుంటోంది.
అలాగే
విపక్ష
వైసీపీ
కూడా
ప్రభుత్వంపై
పోరాటాలతో
తిరిగి
పుంజుకునేందుకు
ప్రయత్నిస్తోంది.
ఈ
క్రమంలో
కూటమితో
పాటు
వైసీపీకి
చెందిన
ఎంపీల
పనితీరు
ఎలా
ఉందన్న
దానిపై
ప్రజల్లో
ఆసక్తి
నెలకొంది.
దీన్ని
తెలుసుకునేందుకు
రాజకీయ
విశ్లేషకుడు,
సర్వేయర్
ప్రవీణ్
పుల్లట
ఓ
సర్వే
నిర్వహించారు.
మన
రాష్ట్రంలో
మొత్తం
25
మంది
లోక్
సభ్యులు
ఉన్నారు.
ఇందులో
టీడీపీకి
16
మంది,
బీజేపీకి
ముగ్గురు,
జనసేనకు
ఇద్దరు,
వైసీపీకి
నలుగురు
ఉన్నారు.
వీరిలో
టీడీపీకి
చెందిన
రామ్మోహన్
నాయుడు,
పెమ్మసాని
చంద్రశేఖర్,
బీజేపీకి
చెందిన
భూపతిరాజు
శ్రీనివాసవర్మ
కేంద్రమంత్రులుగా
ఉన్నారు.
వీరిలో
తాజా
సర్వే
ప్రకారం
కేంద్రమంత్రులు
పెమ్మసాని
చంద్రశేఖర్,
రామ్మోహన్
నాయుడు
టాప్
2గా
నిలిచారు.
వీరి
తర్వాత
స్ధానాల్లో
పుట్టా
మహేష్
యాదవ్(టీడీపీ),
బైరెడ్డి
శబరి(టీడీపీ),
గురుమూర్తి(వైసీపీ),
లావు
కృష్ణదేవరాయలు
(టీడీపీ),
కేశినేని
శివనాథ్
(టీడీపీ),
దగ్గుమళ్ల
ప్రసాదరావు(టీడీపీ),
భూపతిరాజు
శ్రీనివాసవర్మ
(బీజేపీ),
శ్రీభరత్
(టీడీపీ)
టాప్
10లో
ఉన్నారు.
ఆ
తర్వాత
11వ
స్ధానంలో
పెద్దిరెడ్డి
మిథున్
రెడ్డి
(వైసీపీ)
..
ఆ
తర్వాత
ఉదయ్
శ్రీనివాస్(జనసేన),
అప్పలనాయుడు
(టీడీపీ),
పురందేశ్వరి
(బీజేపీ),
హరీష్
మాథుర్
(టీడీపీ),
బాలశౌరి(జనసేన),
సీఎం
రమేష్
(బీజేపీ),
వేమిరెడ్డి
ప్రభాకర్
రెడ్డి
(టీడీపీ),
కృష్ణప్రసాద్
(టీడీపీ),
వైఎస్
అవినాష్
రెడ్డి
(వైసీపీ),
బీకే
పార్ధసారధి
(టీడీపీ),
మాగుంట
శ్రీనివాసులురెడ్డి
(టీడీపీ),
అంబికా
లక్ష్మీనారాయణ
(టీడీపీ),
తనూజారాణి
(వైసీపీ),
నాగరాజు
(టీడీపీ)
ఉన్నారు.
“This
report
aims
to
foster
transparency,
accountability,
and
data-based
evaluation
of
elected
representatives.
Andhra
Pradesh
shows
promising
signs
of
strong
leadership,
but
continuous
improvement
is
essential
for
equitable
development
across
all
regions,”
—
RISE
Research…
pic.twitter.com/RatBhIoJzZ—
Praveen
Pullata
(@praveenpullata)
December
6,
2025
ఈ
సర్వేకు
ప్రామాణికంగా
తీసుకున్న
అంశాల్లో
నియోజకవర్గంలో
పర్యటనలు,
ప్రజా
ఫిర్యాదుల
పరిష్కారం,
మౌలిక
సదుపాయాలు,
అభివృద్ధి
ప్రాజెక్టుల
నిర్మాణం,
డిజిటల్,
సోషల్
మీడియాలో
స్పందన,
పార్లమెంట్
లో
చర్చలు,
జీవో
అవర్
లో
పాల్గొనడం
వంటివి
ఉన్నాయి.
అలాగే
ఆయా
ఎంపీలు
తమ
పనితీరు
మెరుగుపర్చుకోవడానికి
జనానికి
అందుబాటులో
ఉండాలని,
పార్లమెంట్
కు
తరచూ
హాజరుకావాలని
సర్వే
నిపుణుడు
ప్రవీణ్
సూచించారు.


