Telangana
oi-Bomma Shivakumar
ఈ
నెల
8,
9
తేదీల్లో
ఫ్యూచర్
సిటీ
వేదికగా
నిర్వహించే
ప్రతిష్ఠాత్మక
తెలంగాణ
గ్లోబల్
సమ్మిట్
-2025
ఆర్థిక
సదస్సులో
భాగంగా
మంత్రి
శ్రీధర్
బాబు
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
పెట్టుబడులకు
ఎవరైనా
MOU
లు
చేసుకోవచ్చని
అన్నారు.
రెండు
రోజుల్లో
ఎంత
వీలైతే
అంత
MOU
లు
చేసుకుంటామని
పేర్కొన్నారు.
మరోవైపు
తెలంగాణ
రైజింగ్
గ్లోబల్
సమ్మిట్
ఎజెండా
తాజాగా
ఖరారైంది.
రెండు
రోజుల
సదస్సులో
భాగంగా
వివిధ
అంశాలపై
27
ప్రత్యేక
సెషన్లు
జరగనున్నాయి.
ఈ
సదస్సుకు
దేశ
విదేశాల
నుంచి
ప్రముఖులు
విచ్చేయనున్నారు.
ఇక
ఈ
నెల
9న
తెలంగాణ
రైజింగ్
గ్లోబల్
డాక్యుమెంట్
ను
ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ
రైజింగ్
గ్లోబల్
సమ్మిట్-2025
ఈ
నెల
8,
9
తేదీల్లో
ఫ్యూచర్
సిటీ
వేదికగా
జరగనుంది.
అంగరంగ
వైభవంగా
అంతర్జాతీయ
ఆర్థిక
సదస్సులను
తలపించేలా
నిర్వహించేందుకు
ప్రభుత్వం
ప్రణాళికలు
సిద్ధం
చేసింది.
ఈ
ఆర్థిక
సదస్సులో
భాగంగా
మంత్రి
శ్రీధర్
బాబు
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
పెట్టుబడులకు
ఎవరైనా
MOU
లు
చేసుకోవచ్చని
అన్నారు.
రెండు
రోజుల్లో
ఎంత
వీలైతే
అంత
MOU
లు
చేసుకుంటామని
పేర్కొన్నారు.
మరోవైపు
ఈ
సదస్సు
ఏర్పాట్లను
సీఎం
రేవంత్
రెడ్డి
ఏరియల్
సర్వే
ద్వారా
పరిశీలన
చేశారు.
సహచర
మంత్రులు
ఉత్తమ్
కుమార్
రెడ్డి,
కోమటిరెడ్డి
వెంకట్
రెడ్డితో
కలిసి
ఏరియల్
సర్వే
ద్వారా
పరిశీలించారు.
అత్యంత
ప్రతిష్టాత్మకంగా
గ్లోబల్
సమ్మిట్
ను
నిర్వహించేందుకు
రాష్ట్ర
ప్రభుత్వం
సిద్ధమైంది.
ఈ
మేరకు
తెలంగాణలోని
చారిత్రక
కట్టడాలు,
భవనాలు
అత్యాధునికంగా
ముస్తాబవుతున్నాయి.
చార్మినార్,
సెక్రటేరియట్
వద్ద
3
డీ
ప్రొజెక్షన్
మ్యాపింగ్
ఏర్పాటు
చేశారు.
విమానాశ్రయం
నుంచి
సమ్మిట్
వేదిక
దాకా
భారీ
ఎల్
ఈడీ
స్క్రీన్లు
ఏర్పాటు
చేశారు.
అలాగే
ఈ
గ్లోబల్
సమ్మిట్
వేదికకు
50
మీటర్ల
ఇంటరాక్టివ్
టన్నెల్
నిర్మించారు.
ఇలా
నగరంలోని
అన్ని
చోట్లా
హైటెక్
ప్రొజెక్షన్లు,
డిజిటల్
ప్రదర్శనలు,
ఆధునిక
విజువల్
ఎఫెక్టులతో
ముస్తాబుచేశారు.
మరోవైపు
తెలంగాణ
రైజింగ్
గ్లోబల్
సమ్మిట్-2025
రాష్ట్ర
భవిష్యత్
కు
సంబంధించిందని..
ఈ
గ్లోబల్
సమ్మిట్
డాక్యుమెంట్
ద్వారా
ప్రపంచ
దృష్టిని
ఆకర్షిస్తామని
తెలంగాణ
డిప్యూటీ
సీఎం
భట్టి
విక్రమార్క
తెలిపారు.
ఈ
మేరకు
ఈ
గ్లోబల్
సమిట్
వివరాలను
మంత్రి
శ్రీధర్
బాబుతో
కలిసి
మీడియాకు
వివరించారు.
తెలంగాణ
రైజింగ్
గ్లోబల్
సమిట్
లో
27
సెషన్లు
ఉంటాయని
వివరించారు.
గ్లోబల్
సమ్మిట్-2025
కు
వివిధ
రంగాలకు
చెందిన
నిపుణులను
ఆహ్వానించామన్నారు.
ఎయిర్
లైన్స్
సమస్య
త్వరలోనే
పరిష్కారం
అవుతుందన్నారు.
ఇలాంటి
సమ్మిట్
గతంలో
ఎప్పుడూ
జరగలేదని
భట్టి
విక్రమార్క
వివరించారు.


