India
oi-Chandrasekhar Rao
దేశంలో
అతిపెద్ద
పౌర
విమానయాన
సంస్థ
ఇండిగో
ఫ్లైట్లు
నేడు
కూడా
రద్దయ్యాయి.
20
ఏళ్ల
చరిత్రలో
ఎన్నడూ
లేని
విధంగా
ఒకే
రోజు
550కి
పైగా
విమానాలను
రద్దు
చేసింది.
దీనివల్ల
దేశవ్యాప్తంగా
విమానాశ్రయాల్లో
తీవ్ర
గందరగోళం
నెలకొంది.
ఈ
అంతరాయం
వేలాది
మంది
ప్రయాణికులను
గంటల
తరబడి
ఎయిర్
పోర్టుల్లో
పడిగాపులు
పడేలా
చేసింది.
అక్కడే
చిక్కుకుపోయేలా
చేసింది.
ఇండిగో
విమాన
ప్రయాణికులు
నరకం
చవి
చూస్తోన్నారు.
ఇదే
అదనుగా
ఇతర
పౌర
విమానయాన
సంస్థలన్నీ
కూడా
ఇష్టారాజ్యంగా
ఛార్జీలను
పెంచేశాయి.
అతి
తక్కువ
దూరానికి
కూడా
వేలకు
వేల
రూపాయలను
వసూలు
చేస్తోన్నాయి.
విమానాశ్రయాల్లో
చిక్కుకుపోయిన
ప్రయాణికులకు
ఇది
మరింత
ఇబ్బందులకు
గురి
చేసింది.
ఊపిరాడనివ్వని
దుస్థితిలోకి
నెట్టింది.
హైదరాబాద్
నుండి
ముంబైకి
రెండు
స్టాప్‌లతో
కూడిన
ఎయిర్
ఇండియా
విమానానికి
ఎకానమీ
క్లాస్,
వన్
వే
టికెట్
ధర
రూ.
70,329,
హైదరాబాద్
నుండి
భోపాల్‌కు
మరో
ఎయిర్
ఇండియా
ఫ్లైట్
ధర
రూ.
90,000
వసూలు
చేసినట్లు
సమాచారం.
ఈ
పరిస్థితులను
దృష్టిలో
పెట్టుకుని
కేంద్ర
ప్రభుత్వం
నివారణ
చర్యలు
చేపట్టింది.
పౌర
విమానయాన
సంస్థలన్నింటికీ
కూడా
కొత్త
ఛార్జీల
శ్లాబ్
లను
ప్రకటించింది.
మొత్తం
నాలుగు
శ్లాబులతో
కూడిన
కొత్త
ఛార్జీల
వివరాలను
పౌర
విమానయాన
మంత్రిత్వ
శాఖ
కొద్దిసేపటి
కిందటే
విడుదల
చేసింది.
కొత్త
ఛార్జీలకు
అదనంగా
ఒక్క
రూపాయి
కూడా
వసూలు
చేయడానికి
వీల్లేదని
తేల్చి
చెప్పింది.
ఈ
సంక్షోభం
సమసిపోయేంత
వరకూ
ఈ
ఛార్జీలు
కొనసాగుతాయి.
ఈ
ఛార్జీల
పరిమితులు
అన్ని
రకాల
బుకింగ్‌లకు
వర్తిస్తాయి.
నేరుగా
కౌంటర్లల్లో
కొనుగోలు
చేసినా
లేదా
ఎయిర్‌లైన్
అధికారిక
వెబ్‌సైట్
ద్వారా
తీసుకున్నా
లేదా
వివిధ
ఆన్‌లైన్
ట్రావెల్
ఏజెంట్ల
ప్లాట్‌ఫారమ్‌ల
ద్వారా
పొందినా
ఇవే
ఛార్జీలు
వర్తిస్తాయి.
ఇందులో
యూజర్
డెవలప్మెంట్
ఫీ,
పాసింజర్
సర్వీస్
ఫీ,
ఇతర
పన్నులకు
మినహాయింపు.
బిజినెస్
క్లాస్
లేదా
ఆర్సీఎస్-
ఉడాన్
విమానాలకు
వర్తించవు.
తాజా
శ్లాబ్
ల
ప్రకారం..
500
కిలో
మీటర్ల
దూరానికి
గరిష్ట
ఛార్జీ
రూ.
7,500
500
నుంచి
1,000
కిలో
మీటర్ల
దూరానికి
గరిష్ట
ఛార్జీ
రూ.
12,000
1,000
నుంచి
1,500
కిలో
మీటర్ల
దూరానికి
గరిష్ట
ఛార్జీ
రూ.
15,000
1500,
అంత
కంటే
ఎక్కువ
దూరానికి
వసూలు
చేయాల్సిన
గరిష్ట
ఛార్జీ
18,000
రూపాయలు.


