ప్రపంచానికి ఇంధన గండం!.. భగ్గుమంటున్న చమురు ధరలు..

Date:


Business

oi-Lingareddy Gajjala

ప్రపంచ ఇంధన నాడి అని పిలిచే హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఇప్పుడు యుద్ధ మేఘాల మధ్య చిక్కుకుంది. కేవలం 39 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ చిన్న సముద్ర మార్గం గుండా ప్రపంచ చమురు సరఫరాలో 20% సాగుతుంది. ఇది ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు ఐదో వంతును తీరుస్తుంది. అటువంటి కీలక ప్రాంతంలో నౌకలపై జరిగిన దాడులు కేవలం ట్యాంకర్లను మాత్రమే కాదు, గ్లోబల్ ఎకానమీ పునాదులను కూడా కదిలిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు సముద్ర గర్భం నుండి క్షిపణుల రూపంలో విరుచుకుపడుతున్నాయి.

బ్రిటిష్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) నివేదికల ప్రకారం, ఈ దాడుల తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. గుర్తుతెలియని క్షిపణుల తాకిడికి రెండు భారీ నౌకలు మంటల్లో చిక్కుకోగా, మరో నౌక సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడులకు తామే బాధ్యులమని, అమెరికా మరియు బ్రిటన్‌కు చెందిన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ (IRGC) ప్రకటించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సుమారు 150 చమురు ట్యాంకర్లు నిలిచిపోయి, సముద్రం మధ్యలో ఒక ‘ట్రాఫిక్ జామ్’ లాంటి భయానక వాతావరణం నెలకొంది.

మార్కెట్లపై ‘Oil ధరల’ సునామీ

ఈ దాడుల వార్త వెలువడిన నిమిషాల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. బ్రెండ్ క్రూడ్ ధర ఒక్కసారిగా 7% నుండి 9% వరకు పెరిగి, ఒక దశలో 82 డాలర్ల మార్కును కూడా దాటేసింది. ఇన్వెస్టర్లు భయాందోళనతో చమురు నిల్వలపై ఎగబడటంతో, ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో ఇంత భారీగా పెరిగాయి.

ఇరాన్ పూర్తిగా మూసివేస్తే

ఒకవేళ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేస్తే, బ్యారెల్ ధర 100 డాలర్లు దాటడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి.

రవాణా మార్గాల మార్పు.. పెరగనున్న ఖర్చులు

భద్రత దృష్ట్యా ప్రపంచ ప్రసిద్ధ షిప్పింగ్ సంస్థ ‘మర్స్క్’ (Maersk) తన నౌకలను సూయజ్ కాలువ మీదుగా కాకుండా, ఆఫ్రికా చుట్టూ ఉన్న ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మార్గంలో మళ్లించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రయాణ దూరం వేల కిలోమీటర్లు పెరుగుతుంది, అంటే రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరుగుతాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని OPEC+ దేశాలు రోజుకు 2,06,000 బ్యారెళ్ల అదనపు ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే, హోర్ముజ్ గుండా నిలిచిపోయిన కోట్లాది బ్యారెళ్ల సరఫరాతో పోలిస్తే ఇది సముద్రంలో కాకిపిండంతేనని నిపుణులు పెదవి విరుస్తున్నారు. రక్షణ కవచంలా ఉండే అమెరికా నౌకాదళం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దకపోతే, రాబోయే రోజుల్లో ఇంధన సంక్షోభం తప్పదనిపిస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Sarah Michelle Gellar on Hulu’s Buffy Reboot Cancellation

Would Kerry Washington Return for a ‘Scandal’ Reboot?...

Raven-Symoné on Her Disney Mount Rushmore

After starring as brainy Ren Stevens for three years...