ఇరాన్ యుద్దం ఎన్ని రోజులంటే? ట్రంప్ క్లారిటీ-చర్చలపైనా..!

Date:


International

oi-Syed Ahmed

ఇరాన్ (iran) అణు కార్యక్రమం అడ్డుకునే లక్ష్యంతో ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం ఇప్పుడు గల్ఫ్ దశాలకు విస్తరించింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక అధికారులంతా చనిపోవడంతో రగిలిపోతున్న ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లపై దాడులకు దిగింది. దీంతో గల్ఫ్ దేశాలకూ, ఇరాన్ కూ మధ్య శత్రుత్వం పెరుగుతోంది. అలాగే ప్రపంచ చమురు సరఫరాలకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలపై ప్రభావం పడుతోంది.

ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని అటు గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) స్పందించారు. ఇరాన్‌పై యుద్ధం నాలుగు వారాల పాటు కొనసాగవచ్చని ట్రంప్ వెల్లడించారు. ఇది ఎప్పుడూ నాలుగు వారాల ప్రక్రియ అన్నారు. నాలుగు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని తాము భావించినట్లు బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్‌తో ట్రంప్ అన్నారు. దీంతో ఇరాన్ వార్ ఊహించిన దాని కంటే ఎక్కువ సమయమే తీసుకోబోతున్నట్లు అర్దమవుతోంది.

తమ సైనిక చర్య ఎంత బలంగా ఉన్నా, ఇరాన్ ఒక పెద్ద దేశమని, ఈ యుద్ధం ముగించాలంటేే నాలుగు వారాలు లేదా అంతకంటే తక్కువ సమయం పడుతుందన్నారు. ఇరానియన్లతో మరిన్ని చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. కానీ అది ఇప్పట్లో జరుగుతుందో లేదో వెల్లడించలేదు. చర్చల గురించి తనకు తెలియదని, వారు మాట్లాడాలనుకుంటున్నారు, కానీ నేను, ‘మీరు గత వారం మాట్లాడి ఉండాలి, ఈ వారం కాదు’ అని చెప్పినట్లు ట్రంప్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Democrats blast FCC Chair Carr’s broadcast license threats as anti-First Amendment, ‘totalitarian’

Federal Communications Commission Chair Brendan Carr has drawn fierce...

Sinners Makeup Artist on Michael B. Jordan Transformation

In fact, given the grisly showdown at the juke...

How Much Does Conan O’Brien Get Paid as Host

Oscars Host Conan O’Brien Reveals “Bad” Joke He's...

New Zealand Announces Exciting Graduate Work Visa Changes for 2026 – Here’s Everything You Need to Know!

Home » New Zealand Travel News » New Zealand Announces Exciting Graduate Work...