బాబ్రీ మాదిరి మసీదుకు పునాది | Suspended Trinamool MLA lays foundation stone of Babri mosque in Bengal

Date:


బహిష్కృత టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్‌ కబీర్‌ సారథ్యం

సౌదీ నుంచి వచి్చన మత పెద్దలు 

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన యంత్రాంగం

బహరాంపూర్‌: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా రెజినగర్‌లో శనివారం టీఎంసీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే హుమాయూన్‌ కబీర్‌ పునాది రాయి వేశారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వేడిని రగిలి్చంది. 

రెజినగర్‌లో ఏర్పాటు చేసిన భారీ స్టేజీపై ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను సౌదీ నుంచి వచి్చన ఇస్లామిక్‌ పెద్దలతోపాటు కబీర్‌ కట్‌ చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, మసీదు నిర్మాణం తలపెట్టిన స్థలం అక్కడికి కిలోమీటరు దూరంలో ఉంది. ఈ సందర్భంగా తరలివచి్చన వేలాది మంది ‘నారా–ఇ– తక్‌బీర్, అల్లాహూ అక్బర్‌’అంటూ చేసిన నినాదాలు ఆ ప్రాంతంలో మారుమోగాయి. మసీదు నిర్మాణానికంటూ తలా ఒక ఇటుకను నెత్తిపై ఉంచుకుని ఉదయం నుంచి అక్కడికి వారంతా చేరుకున్నారు. ఆ ఇటుకలతో వలంటీర్లు ఇమారతి ఖైరత్‌ మాదిరి నిర్మాణం చేశారు.  

1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన రోజును పురస్కరించుకుని కబీర్‌ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. పెద్ద ఎత్తున జనం తరలిరావచ్చని, అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని భావించిన అధికారులు ముందు జాగ్రత్తగా రెజినగర్‌తోపాటు బెల్దంగ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మత రాజకీయాలు చేస్తున్నారంటూ కబీర్‌ను అధికార టీఎంసీ సస్పెండ్‌ చేయడం తెల్సిందే. అయినప్పటికీ మసీదు నిర్మాణం విషయంలో వెనుకడుగు వేసేది లేదని ఆయన ప్రకటించారు. ఆ్రస్టేలియాకు చెందిన ఒక వ్యక్తి మసీదు కోసం రూ.80 కోట్లు ఇస్తామంటూ ముందుకు వచ్చారన్నారు. 

నిధుల కొరత లేనే లేదని చెప్పారు. మసీదు సముదాయం సుమారు 15 ఎకరాల్లో విస్తరించి ఉంటుందని, మొత్తం అంచనా వ్యయం రూ.300 కోట్లని చెప్పారు. ఇందులో ఒక ఆస్పత్రి, వైద్య కళాశాల, యూనివర్సిటీ, హోటల్, హెలిప్యాడ్‌ ఉంటాయన్నారు. స్థానిక వైద్యుడొకరు ఇప్పటికే రూ.కోటి విరాళం అందజేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు కేవలం మత పరమైందే కాదు, ఉద్వేగాలకు సంబంధించినదని కబీర్‌ ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో 40 కోట్ల మంది ఉండగా, బెంగాల్‌లో 4కోట్ల మంది ముస్లింలున్నారంటూ ఆయన, ఇక్కడో మసీదును కూడా నిర్మించుకోలేమా అని ప్రశ్నించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related