పైసలేవి మేడం? | Show me the money, madam, Omar witty rejoinder after Sitharaman

Date:


నిర్మలకు ఒమర్‌ ప్రశ్నాస్త్రం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విచిత్రమైన సన్నివేశం ఎదురైంది. శనివారం జరిగిన హిందుస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌ ఇందుకు వేదికైంది. అందులో నిర్మల మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ‘కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక అక్కడ ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 

కానీ జమ్మూ కశ్మీర్‌కు అతి కీలకమైన పర్యాటకం ’బయటి’ పరిస్థితుల వల్ల పూర్తిగా పడకేసింది‘ అని అన్నారు. తర్వాత అదే సదస్సులో ఒమర్‌ మాట్లాడుతూ, అసలు జమ్మూ కశ్మీర్‌లో డబ్బులు ఎక్కడున్నాయి మేడమ్‌ అంటూ నిర్మలను ప్రశ్నించారు. కశ్మీరం ఇప్పుడు మీ కాసులకు చెప్పలేనంతగా కటకటలాడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. తమ ప్రాంత ప్రయోజన కోసం కేంద్రంతో సఖ్యంగా ఉంటే తప్పేమిటని విపక్షాలను, తన విమర్శకులను ప్రశ్నించారు. అందుకోసం పాలక బీజేపీతో జట్టు కట్టాల్సి అవసరం ఏమీ లేదని స్పష్టం చేశారు. 



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related