సౌదీ అరేబియాలో ఉండే భారతీయులకు సూచనలు- ఎంబసీ వాట్సప్ నంబర్లు: రియాధ్, జెడ్డాపై.. !!

Date:


International

oi-Chandrasekhar Rao

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.

తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ మంగళవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల వల్ల దూర ప్రాంతంలో ఉండే నివాసాలు సైతం దెబ్బతిన్నాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శక్తిమంతమైన బాంబులు పేలడంతో పలు నివాసాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ తాజా దాడుల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. సౌదీ అరేబియాలో అమలులో ఉన్న భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, స్థానిక అధికారులు, రాయబార కార్యాలయం జారీ చేసే సలహాలను అనుసరించాలని సూచించింది.

రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెద్దాలోని కాన్సులేట్ జనరల్, వీఎఫ్ఎస్ ద్వారా అందించే తమ ఔట్‌సోర్స్ సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని తాజా సమాచారం, సలహాలు జారీ చేస్తామని తెలియజేసింది. రియాద్/జెద్దా నుండి భారత్ లోని వివిధ గమ్యస్థానాలకు పలు విమానయాన సంస్థలు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. స్వదేశానికి వెళ్లాలనుకునే భారతీయ పౌరులు సీట్ల లభ్యతను తనిఖీ చేసుకుని, ఈ విమాన సేవలను ఉపయోగించుకోవచ్చని సూచించింది.

రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ అత్యవసర 24×7 హెల్ప్‌లైన్ నంబర్లు: 00-966-11-4884697. వాట్సాప్ నంబర్: 00-966-542126748, టోల్-ఫ్రీ: 800 247 1234. ఈమెయిల్: [email protected].

జెద్దాలోని భారత కాన్సులేట్ జనరల్ అత్యవసర 24×7 హెల్ప్‌లైన్ నంబర్లు. వాట్సాప్: +966 536209704, ల్యాండ్‌లైన్: 00966 126648660/00 966 12 2614093, మొబైల్: +966 556122301, టోల్-ఫ్రీ: 800 244 0003. ఈమెయిల్‌లు: [email protected], [email protected].



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Govt makes substantial allocations for guarantees and major schemes

The State government has made substantial allocations for its...

Much ado about protein | The Verge

This is Optimizer, a weekly newsletter sent every Friday...

Trump admin. unveils national AI policy framework to limit state power

U.S. President Donald Trump delivers remarks on artificial intelligence...

Latto Pregnant, Announces She’s Expecting Baby in Music Video

Big Mama, one kid. Indeed, Latto revealed that she is...