ట్రంప్ ను వెనక్కు నెట్టిన భారత ప్రధాని మోదీ మరో రికార్డ్!

Date:


India

-Dr Veena Srinivas

భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియా వేదికగా ప్రజాదరణ బాగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ప్రభావవంతమైన నాయకుడిగా ప్రధాని మోడీకి గుర్తింపు ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆయనకు ఫాల్వర్స్ బాగా పెరుగుతున్నారు. ఇటీవల ఆయన ఇన్స్టాగ్రామ్ లో 10కోట్లకు పైగా ఫాలోవర్స్ ను సాధించి రికార్డ్ సృష్టించారు. మోదీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

మోదీ యూట్యూబ్ ఛానెల్ రికార్డ్ సబ్‌స్క్రైబర్లు

తాజాగా ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 3 కోట్లను దాటి, ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లున్న రాజకీయ నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు.మోదీ యూట్యూబ్ ఛానెల్‌ను 2007లో ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటివరకు 33 వేలకు పైగా వీడియోలను ఆయన తన ఛానల్ ద్వారా పంచుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో 6.6 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో రెండో స్థానంలో ఉన్నారు.

ఆ విషయంలో ట్రంప్ ను దాటేసి మోదీ రికార్డ్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య కంటే మోదీకి ఏడు రెట్లు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌ లు ఉన్నారు. 2023లోనూ మోదీ యూట్యూబ్ ఛానెల్ 2 కోట్లకు పైగా సబ్‌స్క్రిప్షన్‌లను నమోదు చేసి రికార్డ్ సృష్టించింది, వ్యక్తిగత ఖాతాతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్రపంచ నేతగా మోదీ నిలిచేలా చేసింది. సుమారు 450 కోట్ల వీక్షణలతో ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు

.

ఇండియాలో యూట్యూబ్ లో ప్రధాని మోదీ టాప్ లో

భారత్‌లోనూ యూట్యూబ్‌లో ప్రధాని మోదీదే అగ్రస్థానం కావటం విశేషం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే ఆయనకు దాదాపు 3 రెట్లు ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండింటి కంటే నాలుగు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబర్‌లను ప్రధాని మోదీ కలిగి ఉన్నారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ మాత్రమే కాదు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ ప్రధాని మోదీకి భారీగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టా ఇలా ఏదైనా సరే మోదీ మార్క్

ఎక్స్ లో 106 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 54 మిలియన్ల మంది ఫాలోవర్లు ప్రధాని మోదీకి ఉన్నారు. ఈ లెక్కలు ప్రపంచ, దేశీయ రాజకీయాల్లో సోషల్ మీడియాపై ఆయనకున్న తిరుగులేని ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా సోషల్ మేడయా ద్వారా కూడా ప్రధాని మోదీ తన బలమైన ముద్రను భారత దేశ సమాజంపై వేస్తున్నారు. ప్రజలు మెచ్చిన, నచ్చిన నేతగా కొనసాగుతున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related