త్రిషతో సంబంధాలపై ఏకిపారేసిన విజయ్

Date:


India

oi-Chandrasekhar Rao

ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌పై తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలీవానగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్‌తో త్రిషను ముడిపెడుతూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ రంగు పులముకొన్నాయి. బీజేపీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వీటికి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది ఆ పార్టీ నాయకులకు.

దీనిపై తాజాగా విజయ్ సైతం స్పందించారు. బహిరంగంగా ఘాటు విమర్శలు సంధించారు. కరూర్ తొక్కిసలాట వద్ద మొదలుపెట్టిన ఈ ఆరోపణలు ఎక్కడా ఆగట్లేదని అన్నారు. ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటూ వెళ్తోన్నారని ధ్వజమెత్తారు. చివరికి- ఈ ఆరోపణలు జన నాయగన్ సినిమాకూ చుట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని స్థాయిలో ఆరోపణల పరంపర తనను చుట్టుముట్టిందని విజయ్ గుర్తు చేశారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్.. విస్తృతంగా తమిళనాడులో పర్యటిస్తోన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహిస్తోన్నారు. ఇందులో భాగంగా తాజాగా తంజావూరులో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేకించి- ఈ మధ్య కాలంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా గుర్తు చేశారు.

అంతు లేని ఆరోపణలు చేస్తోన్నారని, దీనికి కారణం- తాము ప్రజల్లో బలపడటమేనని విజయ్ పేర్కొన్నారు. జన నాయగన్ సినిమాను కూడా విడుదల కానివ్వకుండా అడ్డుకున్నారంటే తమకు ప్రజల్లో ఏ స్థాయిలో మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. సినిమా విడుదల సమస్య సమయంలో అనేక మంది మద్దతుగా నిలిచారని, ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అండగా ఉన్నారని, వారికి ధన్యవాదాలను తెలియజేస్తోన్నానని విజయ్ చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని విజయ్ ఎండగట్టారు. కనీస సదుపాయాల కోసం ప్రజలు కోరినప్పుడు ఆర్థిక భారం పేరుతో దాన్ని కొట్టిపారేస్తున్నారని మండిపడ్డారు. నీట్ పరీక్షను నిషేధించలేమని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా కూడా దాన్ని నిర్వహించబోమని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించిందని విజయ్ ఆరోపించారు. “మీరు విజయ్‌ని నమ్ముతారా, లేక స్టాలిన్‌ని నమ్ముతారా?” అని ఆయన నేరుగా ప్రశ్నించారు. తనకు వ్యవసాయం తెలియదంటూ చేస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టారు. వచ్చే జన్మంటూ ఉంటే వ్యవసాయ కుటుంబంలో పుడతానని చెప్పారు.

రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ పథకాన్ని తీసుకువచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా సరే, దాన్ని తిరస్కరించి తీరుతామని విజయ్ స్పష్టం చేశారు. అలాగే “ప్రతి 500 రేషన్ కార్డులకు ఒక రేషన్ షాప్ ను అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను తమిళనాడు టీమ్ వర్సెస్ ఢిల్లీ జట్టు మధ్య పోటీగా డీఎంకే చిత్రీకరిస్తోందని, ఈ పోలిక సరికాదని విజయ్ అన్నారు. క్రికెట్‌లోనూ ఢిల్లీ జట్టు తమిళనాడు టీమ్ తో సరిపోలదని వ్యాఖ్యానించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Taylor Frankie Paul Ex Dakota Mortensen on Domestic Assault Case, Bachelor

Season five of Mormon Wives was halted following news...

JWords Announces New Album Sound Therapy

JWords is releasing a new solo album next month....

Birdy Grey Founder on Chic Wedding Guest Dresses, Wedding Season

While wedding season is technically all year long, there's...