ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే..

Date:


Telangana

oi-Bomma Shivakumar

ప్రస్తుతం ఉరుకులు పరుగుల లైఫ్ లో నగరవాసులు కాస్త సేద తీరేందుకు వీలుగా వీకెండ్ టూర్స్ కు వెళ్తుంటారు. కొంతమంది నగరంలోని ప్రదేశాలను చూసేందుకు సమయం కేటాయిస్తే.. మరికొందరు మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మనందరికీ తెలిసిందే. దాన్ని మించిన అరుదైన పక్షులు, జంతువులు, సరీసృపాలు, కీటకాలు మనకు ఇప్పుడు కనువిందు చేస్తున్నాయి. ఇవన్నీ హైదరాబాద్ లోని ఎకోలాజికల్ పార్క్ లో ఉన్నాయి. అదే ‘కచ్చే రాస్తే’ ఎకోలాజికల్ పార్క్.. ఈ పార్కులో ఎన్నో రకాల అరుదైన జంతువులు, పక్షులు, పాములకు నిలయంగా మారింది. నిత్యం ఈ పార్కును వందలాది మంది సందర్శిస్తుంటారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తుంటారు.

హైదరాబాద్ లోని అన్నారం సమీపంలోని కేసీఆర్ కాలనీ లో ఈ ‘కచ్చే రాస్తే’ ఎకోలాజికల్ పార్క్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీకు ఎదురుగానే ఈ పార్కు ఉంటుంది. ఇక్కడి పార్కులో సందర్శకులు ఎంచక్కా జంతువులు, కీటకాలు, పక్షులు, పాములతో సరదాగా గడిపేయొచ్చు. బిజీ లైఫ్ ను పక్కన పెట్టి ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో హాయిగా విహరించవచ్చు. ఇక పిల్లలకు అయితే బెస్ట్ ఎవేర్ నెస్ పార్క్ గా ఇది నిలుస్తోంది. ఈ పార్కును సందర్శిస్తే వాళ్లు ప్రకృతిని అర్థం చేసుకోవడం సులభతరం అవుతుంది.

‘కచ్చే రాస్తే’ ఎకోలాజికల్ పార్క్ హైదరాబాద్ కు కేవలం 40 కి. మీ. దూరంలోనే ఉంటుంది. 45 నుంచి 60 నిమిషాల్లోపు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ ఎకోలాజికల్ పార్క్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 వరకు ఈ పార్కులోకి ఎంట్రీ ఉంటుంది. అయితే ప్రతి బుధవారం ఈ పార్కును మూసి వేస్తారు. పర్యటకులు, సందర్శకులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.

ఇక ఎంట్రీ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ. 600 ఉంటుంది. అలాగే 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం ఉంటుంది. వీరితోపాటు దివ్యాంగులకు కూడా ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ఇక ఇక్కడ దాదాపు 200 లకు పైగా రకాల పక్షులు ఉన్నాయి. అలాగే వింత వింత జంతువులకు నిలయంగా ఈ హైదరాబాద్ ఎకోలాజికల్ పార్క్ ఉంది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related