వాట్సాప్‌లో పదో తరగతి హాల్‌టికెట్లు.. ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోండి..!

Date:


oi
-Suravarapu Dileep

SSC Hall tickets 2026 : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో త్వరలో పదో తరగతి పరీక్షలు (SSC) ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఏపీలో ఈ నెల 16 వ తేదీ నుంచి. తెలంగాణాలో 14 వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ హాల్‌టికెట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వెబ్‌సైట్‌లతోపాటు వాట్సాప్‌ ద్వారానూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీలో (AP SSC Hall Tickets 2026) మార్టి 16 నుంచి ఏప్రిల్ 1 వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ (www.bsc.ap.gov.in), మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ (9552300009), లీప్‌ యాప్‌ ద్వారా SSC హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెగ్యూలర్‌/ ప్రైవేటు/ ఓఎస్‌ఎస్‌సీ రెగ్యులర్‌/ ఒకేషనల్‌ కేటగిరీల వారీగా హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్‌ ద్వారా SSC హాల్‌టికెట్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
> వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది.
> అనంతరం అటువైపు నుంచి మీకు స్పందన వస్తుంది.
> అక్కడ సర్వీస్‌ సెలక్షన్‌ ఆప్షన్ వస్తుంది.
> హాల్‌టికెట్ల కోసం ఎడ్యుకేషన్ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలి.
> అక్కడ అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. మీరు SSC హాల్‌టికెట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
> ఆప్లికేషన్ నంబర్‌తోపాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసుకోవాలి.
> అనంతరం మీ నంబర్‌కు హాల్‌టికెట్ వస్తుంది.
> డౌన్‌లోడ్‌ చేసుకొని, ప్రింట్‌ తీసుకోవాలి.

* తెలంగాణలో (Telangana SSC Hall Tickets) బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ bsc.telangana.gov.in ద్వారా, 80969558096 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాఠశాలల లాగిన్‌లోనూ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మార్చి 14 వ తేదీ నుంచి ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

వాట్సాప్‌ నుంచి SSC హాల్‌టికెట్లు ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
> 8096958096 వాట్సాప్‌ నంబర్‌కు Hi అని మెసేజ్‌ చేయాలి.
> అటువైపు నుంచి వెల్‌కమ్‌ టు మీ సేవ అని రిప్లై వస్తుంది.
> అనంతరం SSC hall ticket march 2026 అని టైప్ చేయాలి.
> అప్పుడు మీ నంబర్‌కు లింక్‌ వస్తుంది.
> ఆ లింక్‌ పైన క్లిక్‌ చేసి జిల్లా, పాఠశాల పేర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
> అనంతరం విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
> చివరగా మీ ఫోన్‌కు వచ్చిన హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Best Mobiles in India



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Trump threatens to delot ICE will handle airport security

U.S. President Donald Trump speaks to the media as...

Don Broco announce ‘Nightmare Tripping’ 2026 UK and European tour

Don Broco have announced a new UK and European...

Sophia Culpo on Dating After Braxton Berrios Dating Rumors

Sophia Culpo Reacts to Braxton Berrios Reunion Rumors...