ఏం వైర్లు కెలికేశావ్ “మార్క్ జుకర్‌బర్గ్” మామ.. ఇన్ స్టాగ్రామ్ డౌన్ !! | instagram one of the prominent social media platform by mark zuckerberg down across the world

Date:


Science Technology

oi-Korivi Jayakumar

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Instagram ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు బిగ్ షాక్ ఇస్తుంది. ఈరోజు ( మార్చి 7, 2026 ) ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ అంతరాయాల కారణంగా లక్షలాది మంది వినియోగదారులు యాప్‌ను సక్రమంగా ఉపయోగించలేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డైరెక్ట్ మెసేజ్‌లు (DMs) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్‌లు మాయమయ్యాయని, సెర్చ్ ఫీచర్ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

కాగా సందేశాలు వచ్చినట్టు నోటిఫికేషన్లు కనిపిస్తున్నప్పటికీ, మెసేజ్‌ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని పలువురు యూజర్లు చెబుతున్నారు. సాంకేతిక అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Downdetector ప్రకారం బుధవారం ఉదయం నాటికి 10,000కుపైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ ఫిర్యాదులు అమెరికా నుంచి వచ్చాయి. భారతదేశంలో కూడా వందల సంఖ్యలో యూజర్లు సమస్యలను నివేదించినట్లు వెల్లడైంది.

instagam-one-of-the-prominent-social-media-platform-by-mark-zuckerberg-down-across-the-world

డౌన్‌డిటెక్టర్ డేటా ప్రకారం వచ్చిన ఫిర్యాదుల్లో సుమారు 71 శాతం యాప్ యాక్సెస్‌కు సంబంధించినవిగా నమోదయ్యాయి. మరో 19 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలకు.. 5 శాతం ఫీడ్ లేదా టైమ్‌లైన్‌కు సంబంధించిన సమస్యలుగా గుర్తించారు. వినియోగదారులు సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ వెబ్‌సైట్ సమస్య తీవ్రతను అంచనా వేస్తుంది. అందువల్ల వాస్తవానికి ప్రభావితమైన వినియోగదారుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈరోజు ఉదయం నుంచే ఈ సమస్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనివల్ల యూజర్లు సందేశాలను పంపలేకపోవడం, వచ్చిన మెసేజ్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు తమ కాంటాక్ట్స్ కనిపించడం లేదని, సెర్చ్ టూల్ కూడా స్పందించకపోవడం వల్ల స్నేహితులను కనుగొనడం కష్టమైందని పేర్కొన్నారు. ఈ సమస్యలపై యూజర్లు పెద్దఎత్తున స్పందించడంతో X (Twitter)లో కూడా దీనిపై చర్చ నడుస్తోంది. వేలాది మంది నెటిజన్లు మీమ్స్, పోస్టులతో ఈ అంతరాయంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అయితే Meta Platformsకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ఈ సమస్యలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. సర్వర్ సంబంధిత లోపం లేదా టెక్నికల్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్యలు తలెత్తి ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని వినియోగదారులు ఆశిస్తున్నారు. మరోవైపు “ఇన్‌స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్‌స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు.. “ఇన్‌స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా… నేను కుక్ అయ్యానా” , “ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

‘Sinners’ & ‘KPop Demon Hunters’ Soundtracks Up After Oscars

Welcome to Billboard Pro’s Trending Up newsletter, where we...

Congress considers blowing up internet law

Internet platforms’ liability shield Section 230 faced another round...

Music Giant Sues Claude Maker Anthropic

BMG has sued Anthropic for copyright infringement, joining the...

Where To Buy Stanley’s New Clutch Bottle & Clutch Bottle Side-Kit Now

All products and services featured are independently chosen by...