India
oi-Lingareddy Gajjala
అల్లంత దూరంలో.. పశ్చిమాసియా తీరాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. క్షిపణుల మోతతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ కకావికలమైంది. సముద్ర మార్గాల్లో చమురు నౌకలు నిలిచిపోయాయి. ఆ సెగ మెల్లగా ప్రవహిస్తూ, ఖండాలు దాటి.. సరిగ్గా ఒక మధ్యతరగతి పెళ్లి పందిరి వాకిట్లోకి వచ్చి ఆగింది. అక్కడ యుద్ధం మొదలైతే, ఇక్కడ వంటల పొయ్యి ఆరిపోయే పరిస్థితి! తమిళనాడుకు చెందిన ఓ జర్నలిస్ట్ తమ ఫ్రెండ్ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మరో వారం రోజుల్లో ముహూర్తం.. పట్టు బట్టలు, ఆహ్వాన పత్రికలు, బంధువుల సందడితో ఆ ఇల్లు కళకళలాడుతోంది. పెళ్లికొడుకు మొహంలో చిరునవ్వు.. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. సరిగ్గా అదే సమయంలో క్యాటరింగ్ మేనేజర్ నుండి ఒక ఫోన్ కాల్! ఆ గొంతులో వణుకు, మాటల్లో ఆందోళన.
“సార్.. పశ్చిమాసియా గొడవల వల్ల గ్యాస్ సప్లై పూర్తిగా కట్ అయిపోయింది. ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. మీరే సిలిండర్లు అరేంజ్ చేయకపోతే.. వేల మందికి వంటలు వండటం మా వల్ల కాదు!” ఆ మాట వినగానే వరుడి కాళ్ల కింద భూమి కదిలిపోయింది.
సిలిండర్లు లేవు..
వరుసగా పెళ్లి ముహూర్తాల సీజన్ ఇది. ఏ క్యాటరర్‌ని అడిగినా అదే సమాధానం.. “సిలిండర్లు లేవు!” అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో, ఇక్కడ ఒక సామాన్యుడి పెళ్లి వంటలు చిక్కుకున్నాయి. ఒకవైపు డీజే సౌండ్లు, మరోవైపు బంధువుల పలకరింపులు.. కానీ లోపల మాత్రం వరుడికి గుండె వేగం పెరుగుతోంది. పశ్చిమాసియాలో రేగిన మంటలు, ఈ పెళ్లి పీటల దగ్గర పొగలు చిమ్ముతున్నాయి. ఈ సరఫరా సంక్షోభాన్ని దాటుకుని, ఆ పెళ్లి భోజనం విస్తరి మీదకు చేరుతుందా? ఆ గ్యాస్ కష్టాలను దాటి పెళ్లికొడుకు గట్టెక్కుతాడా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!
A friend is getting married next week and now an unexpected request from the catering team has put the bridegroom in a difficult spot. The caterers have asked the family to arrange LPG cylinders for the event, citing supply constraints, adding last-minute pressure to the already…
— Sangeetha Kandavel (@sang1983) March 11, 2026


