గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం!

Date:


International

oi-Lingareddy Gajjala

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, అంతర్జాతీయ వాణిజ్యం అస్తవ్యస్తమవుతున్న వేళ భారత్‌కు అద్భుతమైన తీపి కబురు అందింది. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా భారతీయ జెండాతో ప్రయాణించే నౌకలను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది.

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తతల దృష్ట్యా అనేక ఆంక్షలు అమలవుతుండగా, భారత్‌కు మాత్రమే లభించిన ఈ ‘ప్రత్యేక అనుమతి’ దౌత్యపరంగా దేశం సాధించిన పెద్ద విజయంగా కనిపిస్తోంది.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ఈ సానుకూల నిర్ణయం వెలువడింది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, భారత్‌తో ఉన్న సుదీర్ఘ మిత్రత్వాన్ని గౌరవిస్తూ ఇరాన్ ఈ హామీ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే భారత్‌కు చెందిన రెండు భారీ చమురు ట్యాంకర్లు హర్మూజ్‌ జలసంధిని ఎటువంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా దాటడం విశేషం.

చమురు ధరలపై సానుకూల ప్రభావం:

ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతిని చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయన్న ఆందోళనల మధ్య, ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనివ్వనుంది. హర్మూజ్‌ మార్గం సుగమం కావడంతో దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా, ధరలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న అంతర్జాతీయ పరిణామాల మధ్య భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో మరోసారి సఫలీకృతమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related