India
oi-Korivi Jayakumar
గోవాలో
ఘోర
అగ్నిప్రమాదం
కారణంగా
25
మంది
సజీవ
దహనమైన
ఘటన
యావత్
రాష్ట్రాన్ని
విషాదంలో
నింపింది.
నార్త్
గోవా
జిల్లాలోని
అర్పోరాలో
గల
‘బిర్చ్
బై
రోమియో
లేన్’
నైట్‌క్లబ్‌లో
ఈ
దుర్ఘటన
సంభవించింది.
రాజధాని
పనాజీకి
సుమారు
25
కిలో
మీటర్ల
దూరంలో
అర్పోరా
ఉంటుంది.
మృతుల్లో
పర్యాటకులు,
క్లబ్
సిబ్బంది,
స్థానికులు
కూడా
ఉన్నారని
అధికారి
వర్గాలు
తెలిపాయి.
కొన్ని
మృతదేహాలు
పూర్తిగా
కాలిపోయినందున
గుర్తించడానికి
ప్రత్యేక
బృందాలు
పని
చేస్తున్నాయి.
దీంతో
ఈ
వ్యవహారం
దేశ
వ్యాప్తంగా
చర్చనీయాంశంగా
మారింది.
అర్పోరా
ప్రాంతానికి
పర్యాటకుల
తాకిడి
అధికంగా
ఉంటుందని
చెబుతున్నారు.
ఇయర్
ఎండ్
సెలబ్రేషన్స్,
చలికాలాన్ని
ఆస్వాదించడానికి
ఈ
నెలలోనే
ఎక్కువగా
టూరిస్తులు
వస్తుంటారని
వెళ్లదీస్తున్నారు.
ఈ
క్రమంలోనే
నైట్
క్లబ్
లో
వీకెండ్
పార్టీని
నిర్వహించారు.
కాగా
పార్టీ
జోరుగా
సాగుతున్నప్పుడు
అనూహ్యంగా
మంటలు
చెలరేగడంతో
25
మంది
సజీవ
దహనమవ్వగా..
మరో
ఆరుగురు
తీవ్రంగా
గాయపడ్డారు.
తొలుత
వంటగదిలో
మంటలు
చెలరేగగా..
అంతకంటే
ముందు
పేలుడు
శబ్దం
వినిపించినట్లు
ప్రత్యక్ష
సాక్షులు
వాపోతున్నారు.
విషాదానికి
కారణాలు
ఇవేనా..?
ఇక
ఈ
ప్రమాదానికి
క్లబ్
యాజమాన్యం
చేసిన
నిర్లక్ష్యం..
అనుమతులు
లేకుండా
చేపట్టిన
అక్రమ
నిర్మాణాలు,
భద్రతా
ప్రమాణాల
లేకపోవడమేనని
ఆరోపణలు
వెల్లువెత్తుతున్నాయి.
అర్పొర-నగోవా
సర్పంచ్
రోషన్
రెడ్కర్
తెలిపిన
వివరాల
ప్రకారం..
ఈ
క్లబ్‌పై
పంచాయతీ
గతంలోనే
పలుమార్లు
కూల్చివేత
నోటీసులు
జారీ
చేసినట్టు
తెలుస్తోంది.
భాగస్వాముల
మధ్య
అంతర్గత
వివాదాలు
కూడా
ఉండగా..
పంచాయతీ
డైరెక్టరేట్
అధికారులు
తాము
జారీ
చేసిన
ఆర్డర్లను
నిలిపివేశారని
పేర్కొన్నారు.
అనుమతులు
లేని
తాత్కాలిక
తాటాకుల
నిర్మాణం,
అనధికార
మార్పులు,
మంటలు
వ్యాపించడానికి
కారణమయ్యాయని
మండిపడ్డారు.
మరోవైపు
క్లబ్
ఉన్న
ప్రాంతం
లోకి
వెళ్లే
రహదారి
అత్యంత
ఇరుకుండటంతో
అగ్నిమాపక
వాహనాలు
కేవలం
400
మీటర్ల
దూరం
వరకు
మాత్రమే
వెళ్లగలిగాయి.
ఈ
ఆలస్యంతో
సహాయక
చర్యలు
వెంటనే
ప్రారంభం
కాలేకపోయాయని
ఫైర్
ఆఫీసర్లు
స్పష్టం
చేశారు.
డ్యాన్స్
ఫ్లోర్
నుంచి
మంటలు
ఒక్కసారిగా
పైకప్పు
వరకు
వ్యాపించడంతో
ఆ
సమయంలో
అక్కడ
ఉన్న
సుమారు
100
మంది
పర్యాటకులు
తీవ్ర
గందరగోళంలో
పడ్డారు.
దీంతో
కొందరు
బయటకు
పరుగులు
తీయగా..
మరికొందరు
ప్రాణభయంతో
కిందనున్న
వంటగదిలోకి
దూకారు.
అయితే
అక్కడ
దట్టమైన
పొగ
కమ్ముకోవడంతో
శ్వాస
ఆడక
చాలామంది
అక్కడికక్కడే
ప్రాణాలు
కోల్పోయారని
సమాచారం.
అంతే
కాకుండా
మంటలు
మొదలయ్యాక
క్లబ్‌లో
ఎలాంటి
సైరన్లు,
అత్యవసర
సూచనలు,
సేఫ్టీ
లైట్లు
పనిచేయలేదని
ప్రత్యక్ష
సాక్షులు
చెబుతున్నారు.
పైగా
ఎమర్జెన్సీ
ఎగ్జిట్
ద్వారాలు
కూడా
అడ్డంగా
ఉన్నాయనే
ఆరోపణలు
ఉన్నాయి.
ఈ
ఘటనపై
ప్రధాని
నరేంద్ర
మోడీ,
గోవా
ముఖ్యమంత్రి
ప్రమోద్
సావంత్
సైతం
తీవ్ర
దిగ్భ్రాంతి
వ్యక్తం
చేశారు.
మృతుల
కుటుంబాలకు
ప్రగాఢ
సానుభూతి
తెలిపారు.
ఘటనపై
ఉన్నత
స్థాయి
విచారణకు
ఆదేశించి,
భవిష్యత్తులో
రాష్ట్రంలోని
నైట్‌క్లబ్‌లు,
బీచ్
క్యాఫేలు,
రిసార్ట్‌లు
భద్రతా
ప్రమాణాలను
పాటిస్తున్నాయా
అనే
దానిపై
ప్రత్యేక
తనిఖీలు
చేపట్టాలని
ఆదేశించారు.
ఈ
ప్రమాదం
తర్వాత
గోవాలో
ఉన్న
వందలకొద్దీ
నైట్‌క్లబ్‌లు,
బార్లు,
బీచ్
షాకులపై
భద్రతా
ప్రమాణాల
అమలుపై
పెద్ద
చర్చ
మొదలైంది.


