తారకరత్న భార్య అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ..!?

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

తారకరత్న సతీమణి అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ. తాజా ఇంటర్వ్యూలో అలేఖ్య చేసిన పొలిటికల్ కామెంట్స్ తో రాజకీయ అడుగుల పైన ఆసక్తి కర చర్చ మొదలైంది. తన కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి వివరిస్తూ.. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అయితే.. అలేఖ్య రాజకీయంగా ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే అంశం పైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అటు టీడీపీ.. ఇటు వైసీపీ లో పని చేసిన వారితో సన్నిహిత సంబంధాలు ఉన్న వేళ అలేఖ నిర్ణయం ఆసక్తిని మరింత గా పెంచుతోంది.

నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు ఆసక్తి కరంగా మారు తోంది. తారకరత్న మరణం మరణం కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తారకరత్న గురించి, తన పిల్లల గురించి పోస్టులు చేస్తూ వచ్చారు. రాజకీయంగా తాజా ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి. అలేఖ్య తన కుటుంబం.. తారక రత్న ఫ్యామిలీ రాజకీయంగా కీలక పదవుల్లో ఉన్నవారేనని గుర్తు చేసారు. తన తాతయ్య కాంగ్రెస్ లో పని చేసారని.. వైఎస్సార్ కు సన్నిహిత వ్యక్తిగా చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి తన మామయ్య పోటీ చేసారని వివరించారు. విజయ్ సాయి రెడ్డి బాబాయ్, పిన్ని వాళ్ళతోనే తాను ఎక్కువగా పెరిగానని వివరించారు. వారిద్దరూ తనకు బాగా క్లోజ్ అని చెప్పారు. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా పాలిటిక్స్ లో ఉండటంతో వాళ్ళెవరూ ఫ్యామిలీకి టైం ఇచ్చేవాళ్ళు కాదని… అందుకే తారక్ పాలిటిక్స్ లోకి వెళ్తాను అంటే నేను వద్దన్నానని వివచించారు.

అలేఖ్య రెడ్డి రాజకీయ ప్రవేశం పై చర్చ

అయితే, తనకు రాజకీయాల పైన ఇప్పటి వరకు ఆసక్తి లేదని చెబుతూనే.. భవిష్యత్ లో రావాలని అనుకుంటే వస్తానమో అని తన మనసులో మాట బయటపెట్టారు. మనం అనుకున్నది జరుగు తుందో.. జరగదో అంటూ వ్యాఖ్యానించటం ద్వారా మరింత చర్చకు ఆస్కారం ఏర్పడింది. కాగా.. అసలు అలేఖ్య రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ పార్టీ నుంచి వస్తారనేది ఇప్పుడు ఈ చర్చ లో ప్రధాన అంశంగా మారుతోంది. విజయ సాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. అటు నందమూరి బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఇద్దరే తారకరత్న మరణం నుంచి అలేఖ్య కుటుంబానికి అండగా ఉంటున్నారు. అయితే, అసలు తెలంగాణ – ఏపీలో ఎక్కడ రాజకీయంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది మరో కీలక అంశం. ‘నేను రాజకీయ కుటుంబం నుంచే వచ్చాను… కనుక రాజకీయాలలోకి వస్తానేమో?” అంటూ వ్యాఖ్యానించిన అలేఖ్యరెడ్డి ఏ పార్టీ అని ఇంకా అనుకోలేదని చెప్పడమే సందేహాలకు తెరలేపుతోంది. అయితే.. రాజకీయంగా అలేఖ్య ఇప్పటికే ఒక స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

AC/DC Guitarist Stevie Young Hospitalized in Buenos Aires Before Shows

AC/DC guitarist Stevie Young was hospitalized in Buenos Aires,...

Nexstar, Tegna merger closes after winning regulatory approval

Pavlo Gonchar | Sopa Images | Lightrocket | Getty...

Chuck Norris Dead at 86

Chuck Norris is walking into the beyond. The Walker, Texas Ranger...