యూట్యూబ్‌ ప్రీమియం లైట్‌ ప్లాన్ యూజర్లకు గుడ్‌న్యూస్‌… కీలక మార్పులు..!

Date:


oi
-Suravarapu Dileep

Youtube India : యూట్యూబ్‌ లో యాడ్‌ ఫ్రీ అనుభూతి కోసం ప్రీమియం, ప్రీమియం లైట్‌ ప్లాన్‌ లు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్‌ ప్రీమియం ప్లాన్ నెలవారీ ధర రూ.149, ప్రీమియం లైట్‌ నెలవారీ ధర రూ.89 గా ఉంది. అయితే స్టాండర్డ్ ప్లాన్‌ లో అనేక ప్రయోజనాలను అందిస్తుండగా.. లైట్‌ ప్లాన్‌లో కొన్ని పరిమితులను విధించింది. క్రమంగా ఇందులో మార్పులు చేస్తోంది. అయితే తాజాగా లైట్‌ ప్లాన్‌ లో (Youtube Premium lite) కొన్ని మార్పులు చేసింది. ప్రీమియం లైట్ ప్లాన్‌ యూజర్లకు కూడా బ్యాగ్రౌండ్‌ ప్లే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించింది.

స్టాండర్డ్‌ ప్లాన్‌లోనే ఈ అవకాశం ఉండగా.. :
ప్రస్తుతం యూట్యూబ్‌ ప్రీమియం ప్లాన్‌ లో మాత్రమే బ్యాగ్రౌండ్‌ లో కంటెంట్‌ చూసేందుకు, డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి లైట్‌ ప్లాన్‌ లో ఈ అవకాశం లేదు. త్వరలో లైట్ ప్లాన్ యూజర్లకు కూడా బ్యాగ్రౌండ్‌ లో కంటెంట్‌ ను చూసేందుకు కలగనుంది.

త్వరలోనే అందరికీ అందుబాటులోకి :
ప్రస్తుతం కొంత మంది యూజర్లకే ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఫలితంగా రోజు వారీ యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది. గత సంవత్సరం చివర్లో ఈ లైట్‌ ప్లాన్‌ ను యూట్యూబ్‌ తీసుకొచ్చింది.

* యాడ్ ఫ్రీ బ్రౌజింగ్‌ : యూట్యూబ్‌ లైట్‌ ప్లాన్‌లో చాలా వీడియోలను యాడ్స్ లేకుండానే (Ad Free Content) చూడవచ్చని తెలిపింది. అయితే ఎలాంటి వీడియోలకు వర్తిస్తుందనే వివరాలను స్పష్టం చేయలేదు.

* ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్‌ : లైట్‌ యూజర్లు అనేక వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు (Youtube Offline Download) అవకాశం ఉంది. ఫలితంగా ఇంటర్నెట్‌ అందుబాటులో లేని సమయాల్లోనూ ఈ ఆఫ్‌లైన్ కంటెంట్‌ ను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. అనేక మంది యూజర్లకు ఇదో మంచి అవకాశం.

* బ్యాగ్రౌండ్ ప్లే : యూట్యూబ్‌ ప్రీమియం లైట్‌ యూజర్ల ఫోన్‌ స్క్రీన్‌ లాక్‌ అయినా లేదా ఇతర యాప్‌లను వినియోగిస్తున్నప్పుడు యూట్యూబ్‌ వీడియో ఆఫ్‌ కాకుండా ప్లే (Youtube Background Play) అవుతుంది. పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలు వంటి లాంగ్ వీడియో కంటెంట్‌ చూసేవారికి ఈ బ్యాగ్రౌండ్‌ ప్లే ఫీచర్‌ అనుకూలంగా ఉంటుంది.

యూట్యూబ్‌ లైట్‌ ప్లాన్‌ లో అనేక మార్పులు తీసుకొచ్చినా.. మ్యూజిక్‌ వీడియోలను యాడ్ ఫ్రీగా చూసేందుకు స్టాండర్డ్‌ ప్లాన్‌ లోనే అవకాశం ఉంది. దీంతోపాటు ఇతర కీ కంట్రోల్స్‌ ను స్టాండర్డ్‌ ప్లాన్‌ కు పరిమితం చేసింది. అయితే యూజర్ల నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ల మేరకు లైట్‌ ప్లాన్‌ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధర సంవత్సరానికి రూ.1490 గా ఉంది. అయితే విద్యార్థులు డిస్కౌంట్ ధరకు ఈ ప్లాన్‌ ను ఉపయోగించుకోవచ్చు. నెలవారీ వ్యక్తిగత ప్లాన్‌ ధర రూ.149 గా ఉంది. ఫ్యామిలీ ప్లాన్ నెలవారీ ధర రూ.299 గా ఉంది. 5 మంది సభ్యులు వినియోగించుకోవచ్చు. లైట్‌ ప్లాన్‌ కోసం నెలవారీగా రూ.89 చెల్లించాల్సి ఉంటుంది.

Best Mobiles in India



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

PMFBY Crop Loss Reporting Rules for Hailstorm Damage

The weather office has warned of fresh hailstorms and...

Iran war leaves US oil and gas dealmaking ‘in paralysis’

Stay informed with free updatesSimply sign up to the...

From SEO And CRO To Agentic AI Optimization (AAIO)

For 25 years, we’ve built websites for humans who...