తెలంగాణా ఆర్టీసీలో సమ్మె సైరన్.. ఆ డిమాండ్లతో ప్రభుత్వానికి అల్టిమేటం!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలంగాణ ఆర్టీసీ లో సమ్మె సైరన్ మోగింది. టి జి ఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మరోమారు సమ్మెకు సిద్ధమవుతున్నట్టు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు నేడు బస్ భవన్ లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు అందజేశారు. అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలో కూడా సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ నేతలు ఆర్టీసీ సమ్మె తేదీ పైన 14రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల అల్టిమేటం

ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లడం ఖాయం అంటూ అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు హెచ్చరికలు జారీ చేశారు. కార్మిక సంఘాలు చెబుతున్న ప్రకారం ఉద్యోగులు, కార్మికులు అధిక పని భారంతో ఇబ్బంది పడుతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని డిమాండ్

ట్రేడ్ యూనియన్ల పైన ఆంక్షలు విధించడం వల్ల కార్మికులకు న్యాయం జరగడం లేదు. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్ల విషయానికి వస్తే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్ అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు . 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలని చెబుతున్నారు.

ఉద్యోగ భద్రత కోరుతున్న ఆర్టీసీ కార్మికులు

మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా 350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు 2500 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నేతలు అడుగుతున్నారు. ట్రేడ్ యూనియన్ల పైన ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని అంటున్నారు.

అధిక పని భారం తగ్గించాలని డిమాండ్

అన్ని కేటగిరీలలో పనిచేసే ఉద్యోగులపై అధిక పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఈ డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె చేసి తీరుతామని, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Iran attack on Qatar causes ‘extensive damage’ to massive energy hub

QatarEnergy's liquefied natural gas (LNG) production facilities, amid the...

Russell Wilson, Ciara’s Son Future Visit College for Football

Ciara Reveals Plans For Baby No. 5 With...

Fenty Beauty Friends + Family Early Access Sale: Makeup & Skincare

Fenty Beauty lovers, now's your time to shop! The Rihanna-founded...