గ్యాస్ దొరకటం లేదని కుమారీ ఆంటీ ఆవేదన.. కర్రీ, స్ట్రీట్ ఫుడ్ పాయింట్స్ బంద్

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలంగాణ రాష్ట్రంలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ కు ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ కు కొరత ఏర్పడుతుందని, ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రజల గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. వాణిజ్య అవసరాలకు గ్యాస్ దొరకడం లేదు. ఇక గృహ వినియోగాలకు కూడా గ్యాస్ సిలిండర్లను ఇవ్వని పరిస్థితి చోటుచేసుకుంది.

గ్యాస్ కొరత కారణంగా బిజినెస్ చేయలేని పరిస్థితి

స్ట్రీట్ ఫుడ్స్ విక్రయించేవారు, కర్రీ పాయింట్స్ నిర్వహించేవారు గ్యాస్ కొరత కారణంగా బిజినెస్ చేయలేని పరిస్థితి వచ్చింది. స్ట్రీట్ ఫుడ్ తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ తాజా గ్యాస్ సిలిండర్ల కొరతపైన తమ ఇబ్బందిని వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరతతో ఎక్కువ రకాల కూరలు వండలేకపోతున్నామని, బిజినెస్ డల్‌గా సాగుతోందని కుమారీ ఆంటీ వాపోయారు.

గ్యాస్ కొరత పై కుమారీ ఆంటీ ఆవేదన

హైదరాబాద్‌లో రూ.8వేలు పెట్టినా కమర్షియల్ సిలిండర్ దొరకడం లేదని, కట్టెల పొయ్యిపై వంట చేద్దామంటే ఇంటి ఓనర్ ఒప్పుకోవడం లేదన్నారు. చిన్న గ్యాస్ బండ రూ.6వేలకు కొనుగోలు చేసి, దానితో నెట్టుకొస్తున్నామని తెలిపారు. గ్యాస్ కొరతకు ప్రభుత్వం త్వరగా పరిష్కారం చూపాలని కుమారీ ఆంటీ కోరారు.ఒక హైదరాబాద్లో మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ స్ట్రీట్ ఫుడ్స్ విక్రయించేవారు తమ దుకాణాలను బంద్ చేసుకుంటున్నారు.

బ్లాక్ లో కొని బిజినెస్ చేయలేం అంటున్న స్ట్రీట్ ఫుడ్స్, హోటల్స్ నిర్వాహకులు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో, బ్లాక్ లో కొని బిజినెస్ చేయలేమని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే బిజినెస్ లను నిలుపుదల చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే హోటల్స్ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోతే హోటల్స్ నిర్వహించలేమని, తమకు ప్రత్యామ్నాయాన్ని చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ కొరత పైన ఆందోళన

హోటల్స్ బంద్ చేయడమా లేదా ఆందోళన బాట పట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడమా అన్నది హోటల్స్ అసోసియేషన్స్ చర్చిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే హోటల్స్ మీద ఆధారపడిన కుటుంబాలు, ఆతిథ్య రంగం, పర్యాటక రంగం అన్ని ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా తాజా పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ కొరత పైన ఆందోళన కొనసాగుతుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

AC/DC Guitarist Stevie Young Hospitalized in Buenos Aires Before Shows

AC/DC guitarist Stevie Young was hospitalized in Buenos Aires,...

Nexstar, Tegna merger closes after winning regulatory approval

Pavlo Gonchar | Sopa Images | Lightrocket | Getty...

Chuck Norris Dead at 86

Chuck Norris is walking into the beyond. The Walker, Texas Ranger...