నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ

Date:


India

-Oneindia Staff

క‌ర‌ణ్ అదానీ, అదానీ పోర్ట్స్ అండ్ స్పెష‌ల్ ఎక‌నామిక్ జోన్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా, అదానీ సిమెంట్ డైరెక్ట‌ర్‌గా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల న్యూఢిల్లీలో మార్చి 13న జ‌రిగిన ఓ నాయ‌క‌త్వ స‌ద‌స్సులో మాట్లాడుతూ, త‌న నాయ‌క‌త్వ శైలిని, నిర్ణ‌యం తీసుకునే విధానాన్ని రూపుదిద్ద‌డంలో త‌ల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. వారి నుండి నేర్చుకున్న విలువలే వ్యాపార బాధ్య‌త‌లను, స‌వాళ్ల‌ను సమర్థవంతంగా ఎదుర్కోవ‌డానికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తున్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

అదానీ గ్రూప్ ఛైర్మన్, త‌న తండ్రి గౌతమ్ అదానీ నుండి స్థితిస్థాప‌క‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, అలాగే ఓ నాయ‌కుడిగా అంద‌రికీ అందుబాటులో ఉండ‌టం వంటి ఎన్నో ముఖ్య‌మైన లీడ‌ర్‌షిప్ పాఠాల‌ను క‌ర‌ణ్ అదానీ నేర్చుకున్న‌ట్లు తెలిపారు. చిన్నతనంలో త‌న తండ్రి నుండి వ‌చ్చిన ఓ ఫోన్ కాల్ త‌న‌పై శాశ్వ‌త ముద్ర వేసింద‌ని ఒక మ‌ధుర జ్ఞాప‌కానిని పంచుకున్నారు.

ఆయ‌న తండ్రి ఒక‌రోజు తెల్ల‌వారుజామున సుమారు ఒంటి గంట‌కు ఫోన్ చేసి నిద్రపోతున్నావా అని అడిగారట‌. తాను నిద్రపోతున్నానని కరణ్ అదానీ చెప్ప‌గానే, “బాధ్య‌త పిలిచిన‌ప్పుడు నాయ‌క‌త్వం అందుబాటులో ఉండాలి” అని గౌతమ్ అదానీ స‌మాధానం ఇచ్చార‌ని కరణ్ గుర్తుచేసుకున్నారు. ఈ క్ష‌ణం నాయ‌క‌త్వానికి నిరంత‌ర అవ‌గాహ‌న‌, క‌ట్టుబాటు అవ‌స‌ర‌మ‌ని త‌న‌కు బ‌ల‌ప‌రిచింద‌ని ఆయన పేర్కొన్నారు.

త‌న తండ్రి ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నా, భవిష్యత్తుపై గట్టి నమ్మకంతో ఎలా ముందుకు సాగాలో తాను ఎప్పుడూ గ‌మ‌నించిన‌ట్లు క‌ర‌ణ్ అదానీ తెలిపారు. క‌ష్ట స‌మ‌యాల్లో కూడా దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలపై దృష్టి సారించ‌డ‌మే ఆయ‌న నేర్పిన అత్యంత ముఖ్య‌మైన పాఠం అని కరణ్ అన్నారు. ఈ విలువులు తన నాయకత్వ శైలిని గణనీయంగా ప్రభావితం చేశాయని వివరించారు.

గౌతమ్ అదానీ ఎంత బిజీగా ఉన్నా, లేదా అత్యంత ముఖ్య‌మైన మీటింగ్‌లో ఉన్నా ఆయ‌న‌ను అప్ప‌టిక‌ప్పుడే అడ్డుకునేది ముగ్గురు మాత్ర‌మేన‌ని క‌ర‌ణ్ అదానీ ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు. ఆ ముగ్గురు మరెవరో కాదు, ఆయ‌న ముగ్గురు మ‌న‌వ‌రాళ్ల‌ని తెలిపారు. వారు గ‌దిలోకి వ‌చ్చిన‌ప్పుడు అత్యంత తీవ్ర‌మైన స‌మావేశాలు కూడా ఆగిపోతాయ‌ని, ఇది నాయ‌క‌త్వం, కుటుంబ జీవితం మ‌ధ్య స‌మతుల్య‌త‌ను సూచిస్తుందని కరణ్ నొక్కి చెప్పారు.

తల్లి ప్రీతి అదానీ ప్రభావం గురించి కూడా కరణ్ అదానీ ప్రస్తావించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా ప్రీతి అదానీ విద్యా, ఆరోగ్య సంరక్షణ మ‌రియు స‌మాజాల‌లో సుస్థిర జీవనోపాధిపై దృష్టి సారించి సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌తో కలిసి ఆమె పనిచేయడం చూసి, నాయకత్వం కేవలం వ్యాపార విజయం కాద‌ని, అంత‌కు మించి ఉంటుందని తాను అర్థం చేసుకున్నానని కరణ్ చెప్పారు.

వ్యాపార వృద్ధి అనేది ప్రజలకు, సమాజానికి అర్థవంతమైన ప్రభావాన్ని కూడా సృష్టించాలని ఇది తనకు స్పష్టంగా తెలియజేసినట్లు కరణ్ అదానీ పేర్కొన్నారు. త‌న త‌ల్లిదండ్రుల ప్రభావం స‌మతుల్య‌మైన నాయ‌క‌త్వ దృక్ప‌థాన్ని అల‌వ‌ర్చుకోవ‌డంలో ఎంతో సాయ‌ప‌డింద‌ని ఆయ‌న అన్నారు. తండ్రి వ్యాపార విస్తరణకు కావాల్సిన విశ్వాసాన్ని నింపగా, త‌ల్లి కరుణ‌, బాధ్య‌త‌ల ప్రాముఖ్య‌త‌ను బ‌ల‌ప‌రిచార‌ని వివ‌రించారు.

పోర్ట్‌లు, లాజిస్టిక్స్, ఇంధనం, విమానాశ్రయాలు, మెటీరియల్‌ల వంటి అనేక రంగాలలో అదానీ గ్రూప్ నిరంతరం విస్తరిస్తున్న తరుణంలో, సంస్థ‌ తన ప్రధాన విలువలతో ముందుకు సాగుతుందని కరణ్ అదానీ అన్నారు. అభివృద్ధికి వేగం, పరిమాణం చాలా ముఖ్యమైనప్పటికీ, శాశ్వ‌త సంస్థలను నిర్మించడంలో కరుణ, బాధ్యత కూడా అంతే ముఖ్యమైనవని ఆయన స్ప‌ష్టం చేశారు.

త‌న త‌ల్లిదండ్రులు అందించిన వారసత్వం గురించి ఆలోచిస్తూ, క‌ర‌ణ్ అదానీ మాట్లాడుతూ, తనకు అందిన అత్యంత ముఖ్యమైన వారసత్వం అవకాశాలు కాదని, అది ఒక విస్తృత దృక్పథమని పేర్కొన్నారు. వ్యాపారాలు ఆస్తులను నిర్మిస్తాయి, కానీ విలువలు సంస్థలను బలోపేతం చేస్తాయని ఆయ‌న అభిప్రాయపడ్డారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Jeweller arrested in IDFC First Bank fraud case in Haryana; 12th arrest

The Haryana State Vigilance and Anti-Corruption Bureau (ACB) on...

iPhone Fold: Launch Date, Price, Huge Battery and Everything We Know

For years, rumors have swirled that Apple has been...

How to Get the Best Night, Sleep Routine, According to an Expert

Best Products for a Good Sleep Routine Regardless of the...