Business
oi-Chandrasekhar Rao
బంగారం, వెండి ధరల్లో తీవ్ర పతనం నమోదవుతోంది. బులియన్ మార్కెట్ ఒత్తిడికి లోనవుతోంది. బలమైన అమెరికా డాలర్, వడ్డీ రేట్ల అనిశ్చితి, ఇరాన్ యుద్ధంతో పెరిగిన ద్రవ్యోల్బణ ఆందోళనలు దీనికి కారణాలు. అంతర్జాతీయంగా వరుసగా రెండో వారమూ పసిడి నష్టపడగా, వెండిలోనూ భారీ అమ్మకాలు జరిగాయి. అమెరికా వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై దృష్టి సారించిన పెట్టుబడిదారులు, ఇవి భవిష్యత్ ధరలను నిర్ణయిస్తాయని భావిస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్లో బంగారం శుక్రవారం తగ్గి, రెండో వారం నష్టాల్లో ముగిసింది. స్పాట్ గోల్డ్ 0.5 శాతం పడిపోయింది. రూ. 5,052.15 డాలర్లకు చేరింది. వారంలో రెండు శాతానికి పైగా పడిపోయింది. ఏప్రిల్ డెలివరీ అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 1.3 శాతం తగ్గి 5,061.70 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. భారత మార్కెట్లోనూ బంగారం తగ్గింది. బంగారం పతనానికి అమెరికా డాలర్ బలోపేతం ప్రధాన కారణమని నిపుణలు చెబుతున్నారు.
ఎంసీఎక్స్ బంగారం ధర 1,60,000 కంటే దిగువకు చేరింది. బంగారం, వెండి ధరలు వరుసగా రెండో వారం కూడా తగ్గడం సుదీర్ఘ విరామం తర్వాత ఇదే తొలిసారి. స్పాట్ బంగారం ఒక శాతం మేర తగ్గి ఔన్సుకు 5,050 డాలర్ల వద్ద నిలిచింది. అదే సమయంలో ఎంసీఎక్స్ వెండి కూడా ఒక శాతం తగ్గగా, స్పాట్ వెండి ఏకంగా నాలుగు శాతం మేర నష్టపోయి ఔన్సుకు 80.50 డాలర్ల వద్ద స్థిరపడింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,102, 22 క్యారెట్లు – రూ. 14,760, 18 క్యారెట్లు – రూ. 12,400
ముంబై..
24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974