ఇరాన్ వార్ లోకి అమెరికా మిత్రులు ? త్వరలో కీలక ప్రకటన..!

Date:


International

oi-Syed Ahmed

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-israel)యుద్ధం ప్రారంభించి 16 రోజులు గడిచిపోయింది. అయినా ఫలితం తేలేలా కనిపించడం లేదు. అన్నింటికీ మించి అమెరికా (US), ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న నష్టాలు, ఈ యుద్దం నుంచి బయటపడేందుకు అవి చేస్తున్న ప్రయత్నాలు, యుద్దం కారణంగా హార్ముజ్ జలసంధి మూసివేత, ప్రపంచ చమురు సంక్షోభంగా మారుతున్న తీరు చర్చనీయాంశమవుతున్నాయి. దీంతో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ వార్ ను మలుపుతిప్పాల్సిన పరిస్దితి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) కు ఎదురవుతోంది.

ఇప్పటికే ఇరాన్ వార్ లో చవి చూస్తున్న నష్టాలతో పాటు హార్ముజ్ జలసంధి నుంచి తమ నౌకల్ని దాటించలేని పరిస్దితి ఎదురుకావడంతో అమెరికా సహా పలు దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా హార్ముజ్ వ్యూహాన్ని ఛేదించాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్.. అమెరికా మిత్రదేశాల్ని ఈ వార్ లోకి లాగుతున్నారు. ఈ మేరకు హార్ముజ్ జలసంధిలో నౌకలకు ఎస్కార్ట్ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మిత్రదేశాల్ని ట్రంప్ కోరారు. దీనికి ఇప్పటివరకూ నేరుగా స్పందించింది జర్మనీ ఒక్కటే. అయినా జపాన్, ఫ్రాన్స్, దక్షిణకొరియా, యూకే, ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాలు కూడా కలిసి వస్తాయని ట్రంప్ అంచనా వేస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే అమెరికా ఓ కీలక ప్రకటన చేయబోతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

హార్ముజ్ జలసంధి గుండా నౌకలకు రక్షణగా ఉండే సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి పలు దేశాలు అంగీకరించాయని రేపోమాపో అమెరికా ప్రకటించబోతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ నివేదించింది. మధ్యప్రాచ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలు ముగిసే ముందు లేదా తర్వాత ఆ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని వారు చెప్పినట్లు తెలిసింది. వైట్ హౌస్ మాత్రం దీనిపై నేరుగా స్పందించడం లేదు. యుద్దంలో పరిస్ధితుల ఆధారంగా అమెరికా ఈ ప్రకటన చేయబోతున్నట్లు వాల్ స్ట్రీట్ వెల్లడించింది. మరోవైపు హార్ముజ్ లో చైనా నౌకలకు ప్రస్తుతానికి అనుమతి లభిస్తున్నా.. ఆ దేశం కూడా ఇంధన భద్రత కోసం తమతో కలిసి వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related