తిరుమల భక్తులకు శుభవార్త: జూన్ నెలలో దర్శనానికి, సేవలకు, గదులకు త్వరపడండి!

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జూన్ నెల కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ లను ఈ నెల 18న టీటీడీ విడుదల చెయ్యనుంది. ఇక ఈ ఆర్జిత సేవా టికెట్లను 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.

శ్రీవారి సేవా టికెట్ల విడుదల ఆ రోజే

ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ లో టికెట్లను కేటాయించనుంది టిటిడి.ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

మార్చి 22న స్వామి కళ్యాణోత్సవంతో పాటు, ప్రత్యేక సేవల కోటా

అంతేకాక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

అంగ ప్రదిక్షణం టోకెన్ల కోటా, గదుల కోటా అప్పుడే

23న అంగ ప్రదిక్షణం టోకెన్ల కోటా, 24న గదుల కోటాను విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.

దివ్యాంగుల కోటా అప్పుడే.. మార్చి 24న 300 రూపాయల టికెట్ల కోటా

తిరుమల శ్రీవారిని వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, దివ్యాంగులు దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవారి సేవా కోటా మార్చి 27న

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఇక శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, ఒంటిగంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు టిటిడి అధికారులు. ఇక తేదీలను దృష్టిలో పెట్టుకుని టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

‘Sinners’ & ‘KPop Demon Hunters’ Soundtracks Up After Oscars

Welcome to Billboard Pro’s Trending Up newsletter, where we...

Congress considers blowing up internet law

Internet platforms’ liability shield Section 230 faced another round...

Music Giant Sues Claude Maker Anthropic

BMG has sued Anthropic for copyright infringement, joining the...

Where To Buy Stanley’s New Clutch Bottle & Clutch Bottle Side-Kit Now

All products and services featured are independently chosen by...