Business
oi-Chandrasekhar Rao
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. అమెరికా-ఇరాన్ యుద్ధ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, డాలర్ అస్థిరత పసిడి డిమాండ్‌ను పెంచాయి. ఈ ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్టులు సగం శాతం పైగా ఎగబాకి 10 గ్రాములకు 1,56,740కి చేరాయి. ఎంసీఎక్స్ మే సిల్వర్ ఫ్యూచర్స్ ఒకశాతానికి పైగా పెరిగింది. కిలో 2,59,569 రూపాయల వద్దకు చేరుకుంది.
గత సెషన్‌లో ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ సుమారు రెండు నష్టంతో 10 గ్రాములకు రూ. 1,55,736 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ సిల్వర్ మే ఫ్యూచర్స్ ఒకశాతం కంటే ఎక్కువ నష్టంతో కిలోగ్రాముకు 2,56,532 రూపాయల వద్ద స్థిరపడింది. ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ముందు అమెరికన్ డాలర్ అస్థిరంగా ట్రేడవుతోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనా.
నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలిలా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లో 22 క్యారెట్లు రూ. 1,44,440, 24 క్యారెట్లు రూ. 1,57,560, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,44,340, 24 క్యారెట్లు రూ. 1,57,460ల వద్ద ట్రేడ్ అవుతోంది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,290 కాగా 24 క్యారెట్లు 1,57,410 రూపాయలుగా నమోదైంది. యూఎస్ స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్స్‌కు 5,023.19 డాలర్లకు చేరింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి 5,027.20 వద్ద స్థిరపడింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,101, 22 క్యారెట్లు – రూ. 14,759, 18 క్యారెట్లు – రూ. 12,399
ముంబై..
24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938