ఇరాన్ వార్ ఎఫెక్ట్- ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్..!

Date:


International

-Syed Ahmed

ఇజ్రాయెల్ (Israel)ఒత్తిడితో ఇరాన్ (iran)పై ఏకపక్షంగా దాడి ప్రారంభించిన అమెరికా (US)కు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్ధితి వచ్చేస్తోంది. యుద్ధం ప్రారంభమై మూడు వారాలు కావస్తుండటం, ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్ధితి మధ్య ఇరాన్ లో పెద్దలందరినీ చంపేశామని, యుద్దం ముగుస్తుందని రోజూ ప్రకటనలు చేయడం తప్ప ఏమీ చేయలేని దుస్దితి ట్రంప్ (donald trump)కు ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (NCTC) డైరెక్టర్ జో కెంట్ (joe kent) ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. వైట్‌హౌస్‌తో తీవ్ర విభేదాల మధ్య ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధానికి నిరసనగానే ఈ చర్య చేపట్టినట్లు కెంట్ తెలిపారు. ట్రంప్ పరిపాలనలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన మొట్టమొదటి, అత్యున్నత స్థాయి అధికారి ఈయనే. తాను ఇరాన్ యుద్ధానికి ఇకపై మద్దతు ఇవ్వలేనని కెంట్ ఎక్స్ లో పోస్టు చేశారు.

ఎక్స్ లో పెట్టిన పోస్టులో కెంట్.. చాలాకాలంగా ఆలోచించిన తరువాత, జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇరాన్ యుద్ధానికి తాను మనస్సాక్షిగా మద్దతు ఇవ్వలేనన్నారు. ఇరాన్ అమెరికాకు ఎటువంటి తక్షణ ముప్పును కలిగించలేదని, ఇజ్రాయెల్, దాని శక్తివంతమైన అమెరికన్ లాబీ ఒత్తిడి కారణంగానే తమ దేశం ఈ యుద్ధాన్ని ప్రారంభించిందని ఆయన తేల్చేశారు. గ్రీన్ బెరెట్స్‌ మాజీ సభ్యుడు, పలు యుద్ధాల్లో పాల్గొన్న జో కెంట్.. ట్రంప్‌కు రాసిన తన రాజీనామా లేఖను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ లేఖలో ఈ ప్రభుత్వం ప్రారంభంలోనే, ఉన్నత స్థాయి ఇజ్రాయెల్ అధికారులు, అమెరికన్ మీడియాలోని ప్రభావవంతమైన వ్యక్తులు తప్పుడు సమాచార ప్రచారాన్ని విస్తృతంగా అమలు చేశారని, ఇది మీ ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని పూర్తిగా బలహీనపరిచి, ఇరాన్‌తో యుద్ధం చేయాలనే అనుకూల భావనలను వ్యాప్తి చేసిందన్నారు. ఈ తప్పుడు ప్రచారం మిమ్మల్ని తప్పుదోవ పట్టించి, ఇరాన్ అమెరికాకు తక్షణ ముప్పుగా ఉందని, ఇప్పుడు దాడి చేస్తే వెంటనే విజయం సాధించవచ్చని నమ్మించిందని, ఇది పూర్తిగా అబద్ధమని తెలిపారు. వేలాది మంది సైనికుల ప్రాణాలను బలిగొన్న వినాశకరమైన ఇరాక్ యుద్ధంలో అమెరికాను లాగడానికి ఇజ్రాయెల్ ఉపయోగించిన అదే తంత్రం ఇది అన్నారు. ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వడం తన వల్ల కాదని, అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని, అమెరికన్ ప్రాణాల విలువను ఏ విధంగానూ సమర్థించని యుద్ధంలో తదుపరి తరాలను పోరాడి, మరణించడానికి పంపడాన్ని సమర్థించలేనని ఆయన స్పష్టం చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Whoopi Goldberg on Sex Life, Dating, Being Single on The View

This is far from the first time that Whoopi...

Vince Gill Supports Taylor Swift Country Music Hall of Fame Induction

Vince Gill was 50 years old when he was...

A Labubu movie is on its way as Pop Mart expands the toy franchise

Labubu dolls are on display at a Pop Mart...

Self Esteem to Open London’s British Airways ARC Venue

AEG Presents has revealed the first wave of artists...