బంగారం ధరల్లో బిగ్ క్రాష్

Date:


Business

oi-Chandrasekhar Rao

బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం నాడు భారీగా పెరిగిన పసిడి రేట్లు నేడు తగ్గుముఖం పట్టాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, మధ్యప్రాచ్య సంఘర్షణ, ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై యుద్ధ ప్రభావం నేపథ్యంలో పెట్టుబడిదారుల అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోత ప్రశ్నార్థకంగా మారడం దీనికి తోడైంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,57,410 రూపాయలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 1,44,290 రూపాయలకు చేరింది. జనవరిలో బంగారం 10 గ్రాముల ధర రికార్డుస్థాయిలో 1,80,000, వెండి 4,20,000 రూపాయలను తాకిన విషయం తెలిసిందే. దాని తర్వాత క్రమంగా కుప్పకూలుతూ వస్తోన్నాయి పసిడి రేట్లు. వెండి కూడా దీన్నే అనుసరిస్తోంది.

నేడు ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్లు రూ. 1,58,240, 22 క్యారెట్లు రూ. 1,45,060ల వద్ద ట్రేడ్ అయింది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్లు రూ. 1,58,140 కాగా 22 క్యారెట్లు రూ. 1,44,960లుగా నమోదైంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణే, ముంబైలలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,58,090, 22 క్యారెట్లు రూ. 1,44,910 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా యూఎస్ స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్‌కు 5,000.77, ఏప్రిల్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి 5,004.60 డాలర్లకు లభిస్తోంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,895, 22 క్యారెట్లు – రూ. 14,570, 18 క్యారెట్లు – రూ. 12,240

ముంబై..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Whoopi Goldberg on Sex Life, Dating, Being Single on The View

This is far from the first time that Whoopi...

Vince Gill Supports Taylor Swift Country Music Hall of Fame Induction

Vince Gill was 50 years old when he was...

A Labubu movie is on its way as Pop Mart expands the toy franchise

Labubu dolls are on display at a Pop Mart...

Self Esteem to Open London’s British Airways ARC Venue

AEG Presents has revealed the first wave of artists...