ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే!

Date:


Business

oi-Lingareddy Gajjala

త కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరల భవితవ్యం నేటి రాత్రి తేలనుంది. ప్రపంచ ఆర్థిక గమనాన్ని శాసించే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ (US Fed) వడ్డీ రేట్లపై తీసుకోబోయే అత్యంత కీలక నిర్ణయం కోసం అంతర్జాతీయ మార్కెట్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:30 గంటలకు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేయబోయే ప్రకటన గురువారం పసిడి ధరల దిశను నిర్దేశించనుంది.

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తరహాలోనే, అమెరికా ఫెడరల్ బ్యాంక్ కూడా ద్రవ్యోల్బణ నియంత్రణ మరియు ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేసేందుకు క్రమం తప్పకుండా వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు 3.5% నుండి 3.75% మధ్య కొనసాగుతున్నాయి. గత నెల వరకు ఈ ఏడాది కనీసం మూడు సార్లు రేట్లు తగ్గుతాయని నిపుణులు ఆశించినప్పటికీ, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. పశ్చిమ ఆసియాలో (ఇరాన్-అమెరికా) ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరలు పెరుగుతాయన్న భయాలు ఫెడరల్ రిజర్వ్‌ను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టే అవకాశం ఉంది.

స్థిరత్వానికే మొగ్గు.. యుద్ధ వాతావరణం ప్రభావం

గత ఏడాది నాలుగో త్రైమాసికంలో అమెరికా జీడీపీ (GDP) వృద్ధి కేవలం 0.7 శాతానికే పరిమితం కావడం ఆ దేశ ఆర్థిక బలహీనతను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో, అటు వడ్డీ రేట్లు పెంచలేక, ఇటు తగ్గించలేక ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సందిగ్ధంలో ఉంది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా వడ్డీ రేట్లను యథాతథంగా (స్థిరంగా) ఉంచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ ఉద్రిక్తతల వల్ల చమురు ధర బ్యారెల్‌కు $100 దాటితే, ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే సాహసం కూడా ఫెడ్ చేసే అవకాశం లేకపోలేదు.

Gold ధరపై ప్రభావం ఎలా?

ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం నేరుగా బంగారం ధరతో ముడిపడి ఉంటుంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతారు, అప్పుడు ధరలు పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధర తగ్గుతుంది. అయితే, ఈసారి రేట్లలో మార్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో రేట్ల తగ్గింపుపై జెరోమ్ పావెల్ ఇచ్చే ‘సానుకూల సంకేతాలు’ పసిడికి బలాన్నిస్తాయి. ఒకవేళ కఠిన నిర్ణయాల వైపు మొగ్గు చూపితే బంగారం ధరలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఈ రాత్రి వెలువడే ప్రకటన ఆధారంగానే రేపు ఉదయం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర ఎంత ఉంటుందనేది స్పష్టమవుతుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

CSIR-IICT partners with local firm to convert plastic waste to fuel

CSIR-Indian Institute of Chemical Technology (CSIR-IICT) on Wednesday signed...

Meta is shutting down Horizon Worlds in the metaverse

The Meta Horizon Worlds is being displayed on a...