Telangana
oi-Bomma Shivakumar
సంగారెడ్డి
జిల్లా
రాయికోడ్
మండలం
పిపడ్
పల్లి
గ్రామంలో
ఆశ్చర్యకరమైన
ఘటన
జరిగింది.
గ్రామంలో
మరణించిన
వ్యక్తి
సర్పంచ్
గా
విజయం
సాధించారు.
కాంగ్రెస్
మద్దతుదారుడు
చల్కి
రాజు(35)
9
ఓట్ల
తేడాతో
గెలుపొందారు.
అయితే
చల్కి
రాజు
ఈ
నెల
8న
ఆత్మహత్య
చేసుకున్నారు.
కాంగ్రెస్
మద్దతుతో
బరిలోకి
దిగిన
ఆయన..
ప్రచారానికి
డబ్బులు
లేకపోవడం,
అలాగే
సొంత
పార్టీ
నేతలే
మౌనంగా
ఉండటంతో
చల్కి
రాజు
అయ్యప్ప
మాలలోనే
ఆత్మహత్యకు
పాల్పడ్డాడు.
అయితే
తాజాగా
విడుదలైన
ఫలితాల్లో
రాజు
8
ఓట్ల
తేడాతో
ప్రత్యర్థిపై
విజయం
సాధించారు.
దీంతో
గ్రామంలో
మరోసారి
అధికారులు
ఎన్నికలు
నిర్వహించనున్నారు.
తెలంగాణలో
రెండో
విడత
పంచాయతీ
ఎన్నికల
కౌంటింగ్
ప్రక్రియ
కొనసాగుతోంది.
ఇప్పటివరకూ
పోలింగ్
ఫలితాలను
చూస్తే
అధికార
కాంగ్రెస్
పార్టీ
హవా
కొనసాగుతోంది.
రాత్రి
10
గంటల
వరకు
పార్టీల
వారీగా
గెలిచిన
సర్పంచ్
స్థానాల
లెక్కలు
చూస్తే
కాంగ్రెస్
పార్టీ
2,130
స్థానాల్లో
గెలుపొందింది.
బీఆర్ఎస్
1124
స్థానాల్లో
విక్టరీ
కొట్టింది.
అలాగే
బీజేపీ
245
స్థానాల్లో
విజయం
సాధించింది.
ఇక
ఇతరులు
611
స్థానాల్లో
విజయం
సాధించారు.
ఇంకా
కొన్ని
స్థానాల్లో
కౌంటింగ్
కొనసాగుతోంది.
ఫలితాలు
వెలువడేందుకు
మరింత
సమయం
పట్టనుంది.
ఇక
ఖమ్మం
జిల్లా
కూసుమంచి
మండలం
చేగొమ్మ
గ్రామంలో
మూడోసారి
రీ
కౌంటింగ్
నిర్వహించారు.
ఇప్పటికే
రెండుసార్లు
లెక్కించినా
కాంగ్రెస్,
బీఆర్ఎస్
బలపరిచిన
అభ్యర్థులకు
సమాన
ఓట్లు
వచ్చాయి.
అయితే
అభ్యర్థుల
విజ్ఞప్తితో
మూడోసారి
ఓట్లు
లెక్కిస్తున్నారు
అధికారులు.
మరోవైపు
ఇదే
మండలం
జుజ్జులరావుపేటలో
రీకౌంటింగ్
నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్
బలపరిచిన
అభ్యర్థికి
తొలుత
3
ఓట్ల
ఆధిక్యం
వచ్చింది.
అయితే
కాంగ్రెస్
అభ్యర్థి
విజ్ఞప్తితో
రీకౌంటింగ్
నిర్వహిస్తున్నారు
అధికారులు.
మరోవైపు
మెదక్
జిల్లా
రామాయంపేట
మండలం
ఝాన్సీ
లింగాపుర్
గ్రామంలో
జరిగిన
పంచాయతీ
ఎన్నికల్లో
కుమారుడిపై
తండ్రి
విజయం
సాధించడం
విశేషం.
కుమారుడు
వెంకటేశ్
పై
తండ్రి
మానెగల్ల
రామకృష్ణయ్య
విజయం
సాధించారు.
మూడోసారి
సర్పంచ్
గా
కాంగ్రెస్
మద్దతుదారు
రామకృష్ణయ్య
గెలుపొందారు.


