India
oi-Jakki Mahesh
ఉపాధి
హామీ
పథకం
భవితవ్యంపై
గత
కొన్ని
రోజులుగా
జరుగుతున్న
ఉత్కంఠకు
లోక్సభలో
తెరపడింది.
కేంద్ర
ప్రభుత్వం
ప్రతిష్టాత్మకగా
తీసుకువచ్చిన
‘వికసిత్
భారత్
గ్యారెంటీ
ఫర్
రోజ్గార్
అండ్
ఆజీవికా
మిషన్
(గ్రామీణ)
–
2025’
(VB-G
RAM-G
బిల్లు)
గురువారం
లోక్సభలో
ఆమోదం
పొందింది.
అయితే
ఈ
బిల్లుపై
చర్చ
జరుగుతున్న
సమయంలో
సభలో
ఊహించని
పరిణామాలు
చోటుచేసుకున్నాయి.
దశాబ్దాలుగా
అమల్లో
ఉన్న
మహాత్మా
గాంధీ
జాతీయ
గ్రామీణ
ఉపాధి
హామీ
పథకం
(MGNREGA)
స్థానంలో
కేంద్రం
ఈ
‘జీ
రామ్
జీ’
బిల్లును
తీసుకువచ్చింది.
ప్రస్తుతమున్న
100
రోజుల
ఉపాధి
హామీని
ఈ
కొత్త
బిల్లు
ద్వారా
125
రోజులకు
పెంచుతున్నట్లు
ప్రభుత్వం
ప్రకటించింది.
గతంలో
కేంద్రం
90శాతం,
రాష్ట్రాలు
10శాతం
భరించే
నిధుల
వాటాను
ఇప్పుడు
60:40
నిష్పత్తికి
మార్చారు.
అంటే
రాష్ట్ర
ప్రభుత్వాలపై
ఆర్థిక
భారం
పెరగనుంది.
ఈ
బిల్లును
మొదటి
నుంచీ
వ్యతిరేకిస్తున్న
విపక్ష
సభ్యులు
సభలో
తీవ్రస్థాయిలో
నిరసన
వ్యక్తం
చేశారు.
ప్రభుత్వానికి
వ్యతిరేకంగా
నినాదాలు
చేస్తూ
స్పీకర్
పోడియం
వద్దకు
దూసుకెళ్లారు.
గందరగోళం
మధ్యే
కొందరు
ప్రతిపక్ష
సభ్యులు
బిల్లు
ప్రతిని
చింపి
గాలిలోకి
విసిరేశారు.
ఉపాధి
హామీ
పథకం
పేరు
మార్చడం,
నిబంధనల
మార్పుపై
వారు
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
దీంతో
సభలో
కొద్దిసేపు
తీవ్ర
గందరగోళం
నెలకొంది.
అంతకుముందు
సోనియా
గాంధీ,
మల్లికార్జున
ఖర్గే
నేతృత్వంలో
విపక్ష
ఎంపీలు
పార్లమెంట్
ఆవరణలో
నిరసన
మార్చ్
నిర్వహించారు.
ఈ
బిల్లు
ఆమోదం
తర్వాత
లోక్సభ
శుక్రవారానికి
వాయిదా
పడింది.
శివరాజ్
సింగ్
చౌహాన్
వర్సెస్
ప్రియాంకా
గాంధీ
ఈ
బిల్లుపై
చర్చ
సందర్భంగా
కేంద్ర
మంత్రి
శివరాజ్
సింగ్
చౌహాన్,
కాంగ్రెస్
ఎంపీ
ప్రియాంకా
గాంధీ
మధ్య
మాటల
యుద్ధం
నడిచింది.
“ఈ
ప్రభుత్వం
పేర్ల
మార్పుపైనే
ఎక్కువ
దృష్టి
పెడుతోంది.
మహాత్మా
గాంధీ
పేరును
తొలగించడం
అంటే
ఆయన
ఆశయాలను
అవమానించడమే.
ఈ
కొత్త
బిల్లు
వల్ల
రాష్ట్రాలపై
భారం
పడి
పేదలకు
ఉపాధి
దూరమయ్యే
ప్రమాదం
ఉంది”
అని
ప్రియాంకా
గాంధీ
మండిపడ్డారు.
“గాంధీజీ
పేరును
2009
ఎన్నికల
కోసం
కాంగ్రెస్
వాడుకుంది.
మేము
గాంధీజీ
ఆశయాలను
గౌరవిస్తాము,
అందుకే
100
రోజుల
పనిని
125
రోజులకు
పెంచాం”
అని
మంత్రి
శివరాజ్
సింగ్
చౌహాన్
సమాధానమిచ్చారు.
అలాగే
నెహ్రూ-గాంధీ
కుటుంబం
పేరుతో
ఉన్న
పథకాల
జాబితాను
ఆయన
సభలో
చదివి
వినిపించారు.
ప్రభుత్వం
ఏమంటోంది?
గ్రామీణ
ప్రాంతాల్లో
ఉపాధి
కల్పనను
మరింత
పారదర్శకంగా,
ఆధునికంగా
మార్చేందుకే
ఈ
వీబీ-జీ
రామ్
జీ
బిల్లును
ప్రవేశపెట్టామని
ప్రభుత్వం
పేర్కొంది.
‘వికసిత్
భారత్’
లక్ష్య
సాధనలో
భాగంగా
గ్రామీణ
జీవనోపాధిని
పెంచడమే
దీని
ప్రధాన
ఉద్దేశమని
వెల్లడించింది.
ఉపాధి
హామీ
పథకాన్ని
నీరుగార్చడానికే
ప్రభుత్వం
ఈ
కొత్త
బిల్లును
తీసుకువచ్చిందని,
పేదల
పొట్ట
కొట్టే
ప్రయత్నం
చేస్తున్నారని
విపక్ష
నేతలు
ఆరోపించారు.
సభలో
చర్చకు
అవకాశం
ఇవ్వకుండానే
బిల్లును
పాస్
చేసుకోవడం
ప్రజాస్వామ్య
విరుద్ధమని
మండిపడ్డారు.


