Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీలో
ప్రభుత్వ
క్యాబ్
సేవలు
అందుబాటులోకి
రానున్నాయి.
ఓలా,
ఉబర్
తరహాలో
ఈ
యాప్
కు
రూపకల్పన
చేసారు.
ఆటోలు,
ట్యాక్సీలు,
క్యాబ్‌లు
బుక్
చేసుకోవడానికి
ప్రైవేటు
సంస్థల
యాప్‌లు
వాడుకలో
ఉన్నాయి.
కాగా..
ఇప్పుడు
ముందుగా
ఆంధ్రా
ట్యాక్సీ
పేరుతో
ఈ
యాప్
అందుబాటు
లోకి
తీసు
కొచ్చే
విధంగా
కసరత్తు
జరుగుతోంది.
ప్యాకేజీలు…
ధరలు
పూర్తిగా
ఇతర
ప్రయివేటు
క్యాబ్
ల
కంటే
తక్కవకే
అందుబాటులోకి
తెస్తున్నారు.
ఆంధ్రా
ట్యాక్సీ
పేరుతో
ఏపీ
ప్రభుత్వం
కొత్త
యాప్
తీసుకురానుంది.
ప్రయివేటు
క్యాబ్
సంస్థల
తరహాలో
ప్రభుత్వ
ఆధీనంలో
యాప్‌ను
సిద్దం
చేస్తున్నారు.
ఎన్టీఆర్
జిల్లా
కలెక్టర్
లక్ష్మీశ
రూపొందించారు.
త్వరలోనే
యాప్‌ను
విడుదల
చేస్తామని,
ప్లే
స్టోర్
నుంచి
డౌన్‌లోడ్
చేసుకోవచ్చని
వెల్లడించారు.
ప్రస్తుతం
ప్రైవేట్
సంస్థల
ఆపరేటర్లు
అయిన
ఓలా,
ఉబర్,
ర్యాపిడో
వంటి
సంస్థలు
ప్రజల
నుంచి
ముక్కుపిండి
డబ్బులు
వసూలు
చేస్తున్నాయి.
వాటిల్లో
బైక్,
కారు
క్యాబ్
సర్వీస్
ధరలు
భారీ
మొత్తంలో
ఉంటున్నాయి.
ఇక
రద్దీ,
వర్షం
సమయాల్లో
అధిక
ధరలు
వసూలు
చేస్తున్నాయి.
తక్కువ
దూరానికి
కూడా
అధిక
ఛార్జీలు
తీసుకుంటున్నాయి.
దీంతో
తప్పనిసరి
పరిస్థితుల్లో
వాటిని
ప్రజలు
వాడుతున్నారు.
అయితే
ప్రజలను
ప్రైవేట్
క్యాబ్
సర్వీసుల
బారి
నుంచి
తప్పించుందుకు
ఏపీ
ప్రభుత్వమే
సొంతగా
ఓ
యాప్
తీసుకు
వస్తోంది.
విజయవాడ
దుర్గ
గుడి,
భవానీ
ద్వీపం,
కృష్ణా
నది
తీరం
వెంబడి
ఆలయాల
సందర్శనకు
వచ్చే
పర్యాటకులకు
చౌకగా,
భద్రంగా
రవాణా
సేవలు
అందించడానికి
ఉపయోగపడేలా
దీన్ని
తయారు
చేశారు.
సందర్శకులను
చౌకధరల్లో
సౌకర్యంగా,
భద్రంగా
తిప్పడమే
ఈ
యాప్
ఉద్దేశం.
దీని
ద్వారా
పర్యాటకం
వృద్ధి
చెందుతుందని,
వాహనదారులకు
కచ్చితమైన
ఉపాధి
లభిస్తుందని
అధికారులు
వెల్లడించారు.
ఆంధ్రా
ట్యాక్సీ
పోర్టల్/
యాప్‌లో
క్యాబ్,
ఆటోలను
వాట్సప్,
ఫోన్‌కాల్,
యాప్,
క్యూఆర్
కోడ్
ద్వారా
బుక్
చేసుకోవచ్చు.
ఏ
ప్రాంతం
నుంచి
కావాలో
యాప్‌లో
ఎంటర్
చేస్తే,
అక్కడ
స్థానికంగా
రిజిస్టర్
అయినవి
డ్రైవర్
వివరాలతో
సహా
ఉంటాయి.
రవాణా
శాఖ
అధికారుల
ద్వారా
పరీక్షించి,
ఫిట్‌నెస్
ఉన్నవాటికే
అనుమతి
ఇస్తారు.
మహిళల
భద్రత
దృష్ట్యా
వాహనాల
డేటా,
బుకింగ్
సమాచారం
స్థానిక
పోలీస్
స్టేషన్లకు
అందేలా
యాప్‌ను
రూపొందించారు.
అయితే,
ఈ
యాప్
లో
కొన్ని
ప్రత్యేక
సదుపాయాలు
కల్పించారు.
పర్యాటక
ప్రాంతాలకు
రవాణాతో
పాటు
హోటల్
గదులు
బుక్
చేసుకునేందుకు
ఆప్షన్స్
ఇచ్చారు.
మొత్తం
ప్యాకేజీగానూ
ఎంపిక
చేసుకునే
అవకాశం
కల్పించారు.
రైతుల
అవసరాల
మేరకు
డ్రోన్
సేవలు
కూడా
అందించ
న్నట్లు
వెల్లడించారు.
ఆటోలకూ
కొత్తగా
క్యూఆర్
కోడ్
విధానాన్ని
అందుబాటులోకి
తెచ్చింది.
దీనిలో
భాగంగా
ప్రతి
ఆటో
డ్రైవర్
సీటు
వెనక
క్యూఆర్
కోడ్
అతికిస్తున్నారు.
దీని
ద్వారా
ఎవరైనా
డ్రైవర్
దురుసుగా
ప్రవర్తించినా,
మద్యం
తాగి
వాహనం
నడుపుతున్నా,
విలువైన
వస్తువులు
ఆటోలో
పోగొట్టుకున్నా
సరే
ప్రయాణికులు
క్యూఆర్
కోడ్
స్కాన్
చేసి
పంపితే
చాలు
వెంటనే
ఆ
ఆటో
వివరాలతో
సహా
ఎక్కడుందనేది
కమాండ్
కంట్రోల్
ద్వారా
పోలీసులకు
సమాచారం
త్వరితగతిన
అందుతుంది.
దాంతో
పోలీసులు
అప్రమత్తమై
వెంటనే
చర్యలు
తీసుకుంటారు.
త్వరలోనే
క్యాబ్
యాప్
ను
ప్రభుత్వం
అందుబాటులోకి
తీసుకు
రానుంది.


