ISRO బాహుబలి మిషన్- 5జీ నెట్‌వర్క్‌ లో చరిత్ర | Bluebird Block 2 to Lift Off on LVM3 by ISRO

Date:


Science Technology

oi-Chandrasekhar Rao

భారత
అంతరిక్ష
పరిశోధనా
సంస్థ
(ISRO)
మరో
చారిత్రక
ప్రయోగానికి
పూనుకుంది.

నెల
24న
ఎల్వీఎం
3
రాకెట్
ద్వారా
బ్లూబర్డ్
బ్లాక్
2
ఉపగ్రహాన్ని
ప్రయోగించనుంది.
ఇది
సెల్యులార్
కవరేజ్
లేని
ప్రాంతాలకు
సేవలు
అందించడానికి
ఉద్దేశించిన
భారీ
మిషన్.
4జీ,
5జీ
సిగ్నల్‌ను
నేరుగా
సాధారణ
స్మార్ట్‌ఫోన్‌లకు
అందించడం
దీని
ఉద్దేశం.
బ్లూబర్డ్
బ్లాక్
2
ఉపగ్రహాన్ని
మోసుకుంటూ
24వ
తేదీ
ఉదయం
8:54
నిమిషాలకు
LVM3
శ్రీహరికోటలోని
సతీష్
ధావన్
అంతరిక్ష
కేంద్రం
నుండి
అంతరిక్షానికి
దూసుకెళ్లనుంది.

ఎల్వీఎం
3
సిరీస్
లో
ఇది
తొమ్మిదవ
మిషన్.
ఇస్రోకు
101వ
ప్రయోగం.
2025లో
ఇస్రో
చేపట్టిన
అయిదోది
కూడా.
అమెరికాకు
చెందిన
ఏఎస్‌టీ
స్పేస్‌మొబైల్
అభివృద్ధి
చేసిన
బ్లూబర్డ్
బ్లాక్
2,
ఉపగ్రహ
టెలికమ్యూనికేషన్స్‌లో

వ్యూహాత్మక
ప్రయోగంగా
భావిస్తోన్నారు.
కక్ష్యలోకి
వెళ్ళిన
తర్వాత
ఇది
తన
223
చదరపు
మీటర్ల
ఫేజ్డ్-అరే
యాంటెన్నాను
విస్తరిస్తుంది.
లో-
ఆర్బిట్
లో
అతిపెద్ద
కమర్షియల్
కమ్యూనికేషన్
యాంటెన్నాగా
రికార్డు
సృష్టిస్తుంది.

Bluebird Block 2 to Lift Off on LVM3 by ISRO

బ్లూబర్డ్
బ్లాక్
శాటిలైట్
బరువు
6,100
కిలోలు.
ఇంతకుముందు
ప్రయోగించిన
అయిదు
మోడళ్ల
కంటే
కూడా
10
రెట్లు
ఎక్కువ
బ్యాండ్‌విడ్త్‌ను
అందిస్తుంది.
5,600
పైగా
సిగ్నల్
సెల్స్
ను
అందిస్తుంది.
సాధారణ
మొబైల్
స్మార్ట్
ఫోన్
లకు
కూడా
నేరుగా
కనెక్టివిటీని
అందిస్తుంది.
దీనికోసం
వినియోగదారులకు
ఎలాంటి
అదనపు
ఇన్‌స్టాలేషన్
లేదా
అప్‌గ్రేడ్‌లు
అవసరం
లేదు.

ఉపగ్రహం
సెకనుకు
120
మెగాబిట్స్
గరిష్ట
వేగాన్ని
అందిస్తుంది.

ఇది
4జీ,
5జీ
నెట్‌వర్క్‌ల
ద్వారా
వాయిస్,
మెసేజింగ్,
వేగవంతమైన
డేటా
బదిలీలు,
నిరంతరాయ
వీడియో
స్ట్రీమింగ్‌కు
సరిపోతుంది.
బ్లూబర్డ్
బ్లాక్
2
ప్రధాన
ఉద్దేశం..
అమెరికాను
పూర్తిగా
కవర్
చేయడం.
అనంతరం
దశలవారీగా
ప్రపంచవ్యాప్తంగా
కనెక్టివిటీని
అందిస్తుంది.
గ్రామీణ
ప్రాంతాలు,
సముద్ర
జలాలు,
విమాన
ప్రయాణాల్లో
సాంప్రదాయ
సెల్యులార్
నెట్‌వర్క్‌లు
అందించలేని
కవరేజ్
అంతరాలను
ఇది
పూరిస్తుంది.


మిషన్
కోసం
ఇస్రో
తన
LVM3
రాకెట్‌ను
ఉపయోగిస్తోంది.

బాహుబలి
రాకెట్
ఎత్తు
43.5
మీటర్లు.
640
టన్నుల
బరువు.
బ్లూబర్డ్
బ్లాక్
2ను
భూమికి
దాదాపు
520
కిలోమీటర్ల
ఎత్తులో
లో-
ఆర్బిట్
లో
ప్రవేశపెట్టనుంది.
ఇప్పటివరకు
ఇస్రో
ప్రయోగించిన
అత్యంత
బరువైన

పేలోడ్
లల్లో
ఇదీ
ఒకటి.
అలాగే,
లియో
కక్ష్యలో
ఇప్పటివరకు
అతిపెద్ద
కమర్షియల్
కమ్యూనికేషన్
ఉపగ్రహంగా
నిలవనుంది.
బ్లూబర్డ్
బ్లాక్
2
విజయవంతమైతే
కమ్యూనికేషన్ల
ముఖచిత్రాన్ని
మార్చేయగలదు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related