News
oi-Suravarapu Dileep
కేంద్ర ప్రభుత్వం ఆధార్, పాన్ కార్డును లింక్ చేయాల్సిందిగా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందుకోసం అనేక అవకాశాలు ఇచ్చింది. అయితే ఇవాళ్టితో ఆధార్-పాన్ లింక్ (Aadhaar PAN Link) గడువు ముగుస్తుంది. ఇవాళ్టి లోగా లింక్ పూర్తి చేయని పాన్ కార్డులు రేపటి నుంచి ఇన్‌యాక్టివ్ కానున్నాయని ముందే స్పష్టం చేసింది. మీ పాన్ కార్డు లింక్ అయిందో లేదో ఆన్‌లైన్ లో సులభంగా తెలుసుకోవచ్చు.
ఆధార్ పాన్ కార్డులు లింక్ అయ్యాయా?
ఇందుకోసం ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పొర్టల్ లో ఆప్షన్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేశాక link Aadhaar Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అనంతరం PAN, ఆధార్ నంబర్ లను నమోదు చేయాలి. అనంతరం మీ ఆధార్ పాన్ కార్డులు లింక్ అయ్యాయో లేదో అక్కడ కనిపిస్తుంది.
మీ పాన్ కార్డుతో ఆధార్ వివరాలు లింక్ కాకపోతే e-filing పోర్టల్ ( www.incometax.gov.in ) ద్వారా లింక్ చేసేందుకు ఇవాళ్టి వరకు అవకాశం ఉంది. పాన్, ఆధార్ తోపాటు మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం 7 నుంచి 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
రేపటి నుంచి ఏం జరుగుతుంది :
ఆధార్ వివరాలతో పాన్ కార్డును లింక్ చేసుకొనేందుకు డిసెంబర్ 31, 2025 వరకు అవకాశం ఉంది. ఈ గడువులోగా లింక్ చేసుకోలేకపోతే.. జనవరి 1, 2026 నుంచి పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. అయితే PAN కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకొనేందుకు ఆధార్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
SMS విధానంలో స్టేటస్ ఎలా తనిఖీ చేసుకోవాలి :
అయితే SMS విధానంలోనూ ఆధార్ పాన్ కార్డులు లింక్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం UIDPAN అని టైప్ చేసిన అనంతరం ఆధార్ నంబర్, PAN కార్డు నంబర్ ను టైప్ చేయాలి. అనంతరం 567678 లేదా 56161 నంబర్ కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
అయితే మీరు ఇటీవలే ఆధార్ పాన్ కార్డులను లింక్ చేసేందుకు దరఖాస్తు చేసినట్లయితే ఒకటి రెండు రోజుల తర్వాత పై విధానంలో SMS చేయడం ఉత్తమం. సుమారుగా నెల రోజుల్లోగా లింక్ పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ఆధార్ పాన్ కార్డులు ఎందుకు లింక్ చేసుకోవాలి? :
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పాన్ కార్డులు కలిగిన ప్రతి వ్యక్తి ఆధార్ తో లింక్ చేసుకోవాలి. నకిలీ కార్డులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తప్పనిసరి చేసింది. ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది.
పాన్ కార్డు డియాక్టివేట్ అయితే ITR ప్రక్రియను పూర్తి చేయలేరు. మరియు బ్యాంకుల్లో రూ.50 వేల కంటే ఎక్కువ లావాదేవీలు పూర్తి చేయలేరు. మరియు లోన్ లు పొందడం కూడా కష్టమవుతుంది.
Best Mobiles in India
English summary
Did you Finish Aadhaar PAN Linking, december 31 is the last date to link


