India
oi-Kannaiah
బాలీవుడ్
‘ఖిలాడీ’అక్షయ్
కుమార్,
ఆయన
భార్య
ట్వింకిల్
ఖన్నా
తృటిలో
ప్రాణాపాయం
నుంచి
తప్పించుకున్నారు.
సోమవారం
సాయంత్రం
ముంబై
విమానాశ్రయం
నుంచి
తమ
జుహు
నివాసానికి
వెళ్తుండగా
వీరి
కాన్వాయ్
ప్రమాదానికి
గురైంది.
జుహులోని
సిల్వర్
బీచ్
కేఫ్
సమీపంలో
ఈ
ఘటన
చోటుచేసుకుంది
అసలేం
జరిగిందంటే..?
ఒక
అతివేగంగా
వచ్చిన
మెర్సిడెస్
కారు
తొలుత
ఒక
ఆటో
రిక్షాను
బలంగా
ఢీకొట్టింది.
ఆ
వేగానికి
ఆటో
పక్కనే
ఉన్న
అక్షయ్
కుమార్
సెక్యూరిటీ
వాహనంపైకి
దూసుకెళ్లింది.
దీని
ప్రభావంతో
సెక్యూరిటీ
వాహనం
అక్షయ్
ప్రయాణిస్తున్న
ఎస్‌యూవీని
ఢీకొట్టింది.
ఇలా
ఒకదాని
వెనుక
ఒకటి
వాహనాలు
ఢీకొనడంతో
ఆ
ప్రాంతంలో
భారీ
శబ్దం
వినిపించింది.
మానవత్వం
చాటుకున్న
అక్షయ్
కుమార్
ప్రమాదం
జరిగిన
వెంటనే
అక్షయ్
కుమార్
ఏమాత్రం
ఆలస్యం
చేయకుండా
తన
కారు
దిగి
బాధితులకు
సాయం
చేసేందుకు
ఉరుకులు
పెట్టారు.సెక్యూరిటీ
కారు
కింద
నలిగిపోయిన
ఆటోలో
డ్రైవర్,
ప్రయాణికుడు
చిక్కుకుపోయారు.అక్షయ్
తన
సిబ్బందితో
కలిసి
స్వయంగా
ఆటోను
పైకి
లేపి,
లోపల
ఉన్న
వారిని
సురక్షితంగా
బయటకు
తీశారు.స్థానికులు
ఈ
దృశ్యాన్ని
చూసి
అక్షయ్
సమయస్ఫూర్తిని,
మానవత్వాన్ని
ప్రశంసించారు.
#AkshayKumar‘s
car
gets
hit
as
a
Mercedes
crashes
into
an
auto
rickshaw
in
Juhu,
#Mumbai,
around
9
pm.
The
auto
rickshaw
then
collided
with
Akshay
Kumar’s
Innova.
The
auto
driver
and
passenger
were
injured
and
taken
to
the
hospital,
but
no
fatalities
were
reported.
pic.twitter.com/rglfjOnoUi—
Siraj
Noorani
(@sirajnoorani)
January
19,
2026
25వ
వెడ్డింగ్
యానివర్సరీ
వేళ..
అక్షయ్
కుమార్,
ట్వింకిల్
ఖన్నా
తమ
25వ
వివాహ
వార్షికోత్సవం
జరుపుకోవడానికి
విదేశాలకు
వెళ్లారు.
అక్కడ
వేడుకలు
ముగించుకుని
ముంబైలో
అడుగుపెట్టిన
కొద్ది
గంటల్లోనే
ఈ
ప్రమాదం
జరగడం
గమనార్హం.
ప్రస్తుతం
అక్షయ్
కుటుంబంతో
పాటు
ఆటోలో
ఉన్నవారు
కూడా
సురక్షితంగా
ఉన్నారని
సమాచారం.


