Andhra Pradesh
oi-Sai Chaitanya
Amaravati:ఏపీ
రాజధాని
కేంద్రంగా
కీలక
నిర్ణయాలు
జరుగుతున్నాయి.
రెండో
విడత
భూ
సమీకరణ
తో
పాటు
గా
అమరావతిలో
కొత్త
నిర్ణయాలు
అమలు
అవుతున్నాయి.
అటు
పార్లమెంట్
బడ్జెట్
సమావేశాల్లో
అమరావతికి
రాజధానిగా
చట్టబద్దత
కల్పిస్తూ
బిల్లు
ప్రవేశపెట్టేందుకు
రంగం
సిద్దమైంది.
కాగా..
ఇప్పుడు
రెండో
దశ
మాస్టర్
ప్లాన్
రూపకల్పన
కోసం
సీఆర్డీఏ
బిడ్లు
ఆహ్వానించింది.
సింగపూర్
సంస్థలు
ఇందులో
పాల్గొంటున్నాయి.
ఫిబ్రవరి
6వ
తేదీ
గడువుగా
నిర్ణయించారు.
అమరావతిలో
రెండో
విడత
భూ
సమీకరణ
కొనసాగుతోంది.
రైతులకు
ప్లాట్ల
కేటాయింపు
ప్రక్రియ
ఈ
రోజు
ప్రారంభించారు.
రెండో
దశ
మాస్టర్
ప్లాన్
రూపకల్పను
కన్సల్టెంట్
ను
ఖరారు
చేసేందుకు
సీఆర్డీఏ
టెండర్లను
పిలిచింది.
తొలి
దశలో
సింగపూర్
కు
చెందిన
సుర్బానా
జురాంగ్
సంస్థ
అప్పట్లో
217
చదరపు
కిలో
మీటర్ల
విస్తీర్ణానికి
మాస్టర్
ప్లాన్
అందించింది.
ఇప్పుడు
సీఆర్డీఏ
పిలిచిన
రెండో
దశ
మాస్టర్
ప్లాన్
కోసం
పిలిచిన
టెండర్లలోనూ
సుర్బానా
జురాంగ్
సంస్థ
కూడా
బిడ్
దాఖలు
చేసేందుకు
ఆసక్తి
చూపుతున్నట్లు
తెలుస్తోంది.
తొలి
దశలో
సుర్బానా
సమగ్ర
ప్రణాళికల
తో
పాటుగా
మౌలిక
వసతుల
అభివృద్ధి
ప్రణాళిక
అందించింది.
ఏ
ప్రాంతంలో
ఎలాంటి
సంస్థలు
ఏర్పాటు
చేయాలనేది
సూచనలు
చేసింది.
ఇక..
ఇప్పుడు
రెండో
దశ
మాస్టర్
ప్లాన్
లో
భాగంగా
కనల్స్టెన్సీ
సంస్థ
స్పేషియల్,
ఇన్‌ఫ్రా
ప్లాన్‌తో
పాటు
ఆర్థిక
ప్రణాళికను
రూపొందించే
బాధ్యత
తీసుకోనుంది.
అందులో
భాగంగా
విస్తరణ
ప్రణాళికల్లో
ప్రభుత్వ
భూములతో
సహా
మొత్తం
7
గ్రామాల
పరిధిలో
20,494
ఎకరాలు
ఉంది.
వాటిలో
స్పోర్ట్స్
సిటీ,
రైల్వేలైన్,
రైల్వే
స్టేషన్,
అమరావతి
ఇన్నర్
రింగ్
రోడ్డు
వంటి
ప్రాజెక్టులను
ప్లాన్
చేస్తున్నారు.
అంతర్జాతీయ
విమానాశ్రయం,
స్మార్ట్
పరిశ్రమలు
వంటి
ప్రాజెక్టుల
కోసం
రాబోయే
రోజుల్లో
మరింత
భూమి
సమీకరించాలని
నిర్ణయం
తీసుకున్నారు.
వీటిని
పరిగణలోకి
తీసుకొని
రెండో
దశ
మాస్టర్
ప్లాన్
సిద్దం
చేయనున్నారు.
ఇదే
సమయంలో
ఏపీ
రాజధానిగా
అమరావతి
చట్టవద్దత
కల్పించే
కీలక
బిల్లుకు
పార్లమెంట్
ఆమోద
ముద్ర
వేయనుంది.
ఏపీ
పునర్విభజన
చట్టం
ప్రకారం
2024
జూన్
2
వరకు
హైదరాబాద్
ఉమ్మడి
రాజధానిగా
ఉంది.
ఆ
రోజు
నుంచి
ఏపీ
రాజధానిగా
అమరావతిని
ఖరారు
చేస్తూ
ప్రభుత్వం
పార్లమెంట్
లో
బిల్లు
ఆమోదించనుంది.
ఇక..
మూడేళ్ల
కాలంలో
ప్రస్తుత
నిర్మాణాలను
పూర్తి
చేస్తామని
ప్రభుత్వం
చెబుతోంది.


