Andhra Pradesh
oi-Syed Ahmed
అమరావతి
(Amaravati)
రాజధాని
నిర్మాణం
కోసం
భూములు
ఇచ్చిన
రైతులకు
రిటర్నబుల్
ప్లాట్ల
కేటాయింపు
ప్రక్రియలో
ఇవాళ
మరో
అంకం
పూర్తయింది.
ఇప్పటికే
చాలా
మంది
రైతులకు
ప్లాట్ల
కేటాయింపు,
రిజిస్ట్రేషన్
ప్రక్రియ
పూర్తి
కాగా..
ఇవాళ
మరో
దశ
ప్రక్రియను
సీఆర్డీయే
విజయవంతంగా
పూర్తి
చేసింది.
అలాగే
మరికొంత
మంది
రైతుల
విజ్ఞప్తితో
ప్లాట్ల
కేటాయింపును
వాయిదా
వేసింది.
దీంతో
పాటు
రైతుల
అభ్యంతరాలపైనా
సీఆర్డీయే
అధికారులు
క్లారిటీ
ఇచ్చారు.
రాజధాని
రైతులకు
ఇ-లాటరీ
ద్వారా
115
ప్లాట్లు
కేటాయించినట్లు
సీఆర్డీఏ
ప్రకటించింది.
రాయపూడిలోని
సీఆర్డీఏ
ప్రధాన
కార్యాలయంలో
పూర్తి
పారదర్శకంగా
నిబంధనల
ప్రకారం
అధికారులు
లాటరీ
ప్రక్రియ
పూర్తి
చేసినట్లు
తెలిపింది.మొత్తం
16
సీఆర్డీఏ
యూనిట్ల
పరిధిలోని
గ్రామాలకు
సంబంధించి
145
ప్లాట్లు
కేటాయించేందుకు
అధికారులు
ఏర్పాట్లు
చేశారని,
అయితే
వీటిలో
15
ప్లాట్లకు
సంబంధించిన
కొంతమంది
రైతులు
నిన్నసాయంత్రం
తమకు
ప్రస్తుతానికి
ప్లాట్ల
కేటాయింపు
వాయిదా
వేయాలని
కోరారు.
వీటితో
పాటు
ఈరోజు
ఉదయం
లాటరీ
ప్రక్రియ
ప్రారంభానికి
ముందు
సీఆర్డీఏ
కార్యాలయంలో
అందుబాటులో
ఉంచిన
లేఅవుట్
పరిశీలించిన
తర్వాత
మరో
15
ప్లాట్లకు
చెందిన
రైతులు
కూడా
వాయిదావేయాలని
కోరారు.
ఇలా
30
ప్లాట్లను
మినహాయించి
మిగిలిన
115
ఫ్లాట్లకు
లాటరీ
నిర్వహించినట్లు
వెల్లడించింది.
రైతులకు
కేటాయించిన
ప్లాట్లలో
ఎక్కడా
రోడ్డు
శూల
లేకుండా…అలాగే
సీఆర్డీఏకు
భూమి
ఇవ్వని
రైతుల
ప్లాట్లలో
ఎక్కడా
కేటాయించలేదని
సీఆర్డీఏ
అధికారులు
తెలిపారు.
కొంతమంది
దక్షిణపు
ముఖం
ఉన్న
ప్లాట్లను
తీసుకోవడానికి
అంగీకరించడం
లేదని
చెప్పారు.
కానీ
దక్షిణపు
ముఖం
ప్లాట్లు
రోడ్డు
శూల
ప్లాట్లుగా
పరిగణించకూడదని,గతంలో
కూడా
ఇదే
విధంగా
ప్లాట్లు
కేటాయించామని
అధికారులు
తెలిపారు.
మరోవైపు
ప్రస్తుత
పరిస్థితిలో
కొన్ని
ప్లాట్లు
పల్లపు
ప్రాంతంలో
ఉన్నవని,సమాధులు
దగ్గరగా
ఉన్న
ప్రాంతంలో
కేటాయిస్తున్నారని
కొంతమంది
రైతులు
తీసుకోవడానికి
వెనుకంజ
వేస్తున్నారని
అధికారులు
వెల్లడించారు.
ఇలాంటి
ప్లాట్లను
రిటర్నబుల్
ప్లాట్
లేఅవుట్
నిబంధనల
ప్రకారం
పూర్తిగా
అభివృద్ది
చేసి
ఇస్తామని
సీఆర్డీఏ
అధికారులు
తెలిపారు.


