Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీ
రాజధానిగా
2016లోనే
నిర్ణయించిన
అమరావతి
పనులు
కొంత
మేర
ప్రారంభమైనా
2019లో
రాష్ట్రంలో
వైసీపీ
ప్రభుత్వం
రావడంతో
నిలిచిపోయాయి.
మూడు
రాజధానుల
ప్రక్రియలో
భాగంగా
అమరావతితో
పాటు
విశాఖ,
కర్నూలు
రూపంలో
మరో
రెండు
రాజధానులు
పోటీకి
వచ్చాయి.
అయితే
ఈ
విధానాన్ని
వ్యతిరేకిస్తూ
2019లో
ప్రజలు
ఇచ్చిన
తీర్పుతో
2024లో
అమరావతిలో
తిరిగి
పనులు
ప్రారంభించేందుకు
అవకాశం
లభించింది.
దీన్ని
సద్వినియోగం
చేసుకున్న
కూటమి
సర్కార్
ఈ
ఏడాది
ప్రధాని
మోడీని
రాష్ట్రానికి
రప్పించి
అమరావతి
పనుల
పునఃప్రారంభం
చేసింది.
అమరావతి
రాజధాని
పనుల
ప్రారంభానికి
సూచికగా
ముందుగా
జంగిల్
క్లియరెన్స్
పనులు
చేపట్టిన
కూటమి
సర్కార్..
ఆ
తర్వాత
క్రమంగా
అసలు
పనులపై
ఫోకస్
పెట్టింది.
ఇందులో
భాగంగా
గత
నెలలో
రాజధాని
ప్రాధికార
సంస్థ(సీఆర్డీఏ)
ప్రధాన
భవనం
నిర్మాణం
పూర్తి
చేసుకుని
ప్రారంభించారు.
అదే
సమయంలో
అమరావతిలో
గతంలో
సగంలో
వదిలేసిన
అధికారుల
క్వార్టర్లు,
ఎమ్మెల్యేల
క్వార్టర్లు,
శాశ్వత
సచివాలయం,
ఇతర
టవర్స్
నిర్మాణాలు
కూడా
తిరిగి
ప్రారంభమయ్యాయి.
దీంతో
పాటు
అమరావతికి
గతంలో
వచ్చి
తిరిగి
వెళ్లిపోయిన
పలు
సంస్థల్ని
తిరిగి
తీసుకురావడంలో
కూటమి
సర్కార్
సక్సెస్
అయింది.
దీంతో
ఆయా
సంస్థలు
తిరిగి
ఇక్కడికి
వచ్చి
నిర్మాణాలు
చేపట్టేందుకు
సిద్ధమయ్యాయి.
అలాగే
కొత్తగా
మరికొన్ని
సంస్థలు
కూడా
ఇందులో
వచ్చి
చేరాయి.
వీటిలో
దసపల్లా
గ్రూప్,
ఎక్స్
ఎల్
ఆర్ఐ,
బసవతారకం
ఆస్పత్రి
వంటి
ఎన్నో
నిర్మాణాలు
ఉన్నాయి.
దీంతో
పాటు
క్వాంటం
వ్యాలీ
నిర్మాణానికి
కూడా
ప్రభుత్వం
పనులు
వేగంగా
పూర్తి
చేస్తోంది.
మరోవైపు
అమరావతి
రైతులకు
గతంలో
ఇచ్చిన
హామీ
మేరకు
అభివృద్ధి
చేసిన
రిటర్నబుల్
ప్లాట్లను
ఇచ్చేందుకు
మార్గం
సుగమం
అయింది.
దీంతో
పాటు
రైతులకు
గతంలో
ఇచ్చిన
మిగతా
హామీల
అమలు
కూడా
ప్రారంభమైంది.
దీంతో
రైతులు
సంతోషంగా
కనిపిస్తున్నారు.
మరోవైపు
రైతులకు
ఇచ్చిన
రిటర్నబుల్
ఫ్లాట్ల
రిజిస్ట్రేషన్లు,ఇతర
ప్రక్రియలు
కూడా
వేగంగా
పూర్తవుతున్నాయి.
అదే
సమయంలో
రాజధానిలో
మరో
16వేల
ఎకరాలకు
పైగా
భూముల్ని
భూసమీకరణ
చేసేందుకు
కేబినెట్
లైన్
క్లియర్
చేసింది.
ఇందులో
కొత్త
ఎయిర్
పోర్టుతో
పాటు
మరికొన్ని
కీలక
నిర్మాణాలు
చేపట్టేందుకు
రంగం
సిద్దమవుతోంది.


