Amaravati: రాజధాని గడ్డపై రాజసం; తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

నవ్యాంధ్ర
రాజధాని
అమరావతి
చరిత్రలో
మరో
కీలక
ఘట్టం
ఆవిష్కృతమైంది.
రాష్ట్ర
విభజన
అనంతరం
మొదటిసారిగా
ఆంధ్రప్రదేశ్
రాజధాని
అమరావతి(Amaravati)
వేదికగా
77వ
గణతంత్ర
దినోత్సవ
వేడుకలు
అత్యంత
వైభవంగా
జరిగాయి.
హైకోర్టు
సమీపంలోని
విశాలమైన
మైదానంలో
జాతీయ
పతాకం
రెపరెపలాడుతుంటే..
ఆంధ్రుల
ఆత్మగౌరవ
నినాదం
గగనమంత
ఎత్తున
వినిపించింది.

రాష్ట్ర
గవర్నర్
జస్టిస్
అబ్దుల్
నజీర్
ముఖ్య
అతిథిగా
విచ్చేసి
జాతీయ
జెండాను
ఆవిష్కరించారు.
అనంతరం
సాయుధ
దళాల
నుంచి
ఆయన
గౌరవ
వందనం
స్వీకరించారు.
అనంతరం
పరేడ్‌లో
పాల్గొన్న
11
ప్రత్యేక
దళాలు
క్రమశిక్షణతో
కదం
తొక్కగా,
పోలీసులు
మరియు
ఎన్సీసీ
క్యాడెట్ల
ప్రదర్శనలు
ఆకట్టుకున్నాయి.
రాష్ట్ర
ప్రభుత్వ
ప్రాధాన్యతలను,
సంక్షేమ
పథకాలను
మరియు
అభివృద్ధిని
చాటిచెప్పేలా
22
వివిధ
శాఖల
శకటాలను
ప్రదర్శించారు.
అమరావతి
నిర్మాణం,
పోలవరం
ప్రాజెక్టు,
మరియు
విద్యా-వైద్య
రంగాల్లో
మార్పులను

శకటాలు
ప్రతిబింబించాయి.


వేడుకలకు
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడు,
ఉప
ముఖ్యమంత్రి
పవన్
కళ్యాణ్
ప్రత్యేక
ఆకర్షణగా
నిలిచారు.
మంత్రులు
లోకేశ్,
అచ్చెన్నాయుడు,
నారాయణ
తదితర
కీలక
నేతలు
హాజరై
వేడుకలను
వీక్షించారు.
రాజధాని
నిర్మాణం
కోసం
భూములిచ్చిన
రైతులు,
మహిళలు

వేడుకలను
చూసేందుకు
భారీగా
తరలివచ్చారు.
తమ
భూమిలో
రాజధాని
వైభవాన్ని
కళ్లారా
చూడటంతో
వారిలో
భావోద్వేగం
కనిపించింది.
విద్యార్థుల
కేరింతలతో
మైదానం
మార్మోగింది.

గత
కొన్నేళ్లుగా
అనిశ్చితిలో
ఉన్న
అమరావతిలో
అధికారికంగా
గణతంత్ర
వేడుకలు
నిర్వహించడం
ద్వారా,
ప్రభుత్వం
అంతర్జాతీయ
స్థాయి
రాజధాని
నిర్మాణానికి
తమ
నిబద్ధతను
చాటుకుంది.
“అమరావతియే
ఏపీ
రాజధాని”
అనే
స్పష్టమైన
సందేశాన్ని

వేదిక
ద్వారా
ప్రజలకు,
పెట్టుబడిదారులకు
పంపినట్లయ్యింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related