Telangana
oi-Syed Ahmed
చర్లపల్లి-తిరువనంతపురం
నార్త్
స్టేషన్ల
మధ్య
ప్రయాణించేలా
తాజాగా
ప్రధాని
మోడీ
ప్రారంభించిన
అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్
ప్రెస్
(amrit
bharat
Express)
రైలుకు
తాత్కాలిక
షెడ్యూల్
మాత్రమే
ఇచ్చారు.
అయితే
ఇప్పుడు
రైల్వేశాఖ
ఈ
రైలు
రెగ్యులర్
షెడ్యూల్
ను
విడుదల
చేసింది.
చర్లపల్లి
నుంచి
తిరువనంతపురం
వరకూ
సాగే
ఈ
ఎక్స్
ప్రెస్
ప్రయాణం
ఎప్పుడు
ప్రారంభమవుతుంది,
ఎప్పుడు
ముగుస్తుంది,
ఏయే
హాల్ట్
లలో
ఏ
సమయానికి
ఈ
రైలు
వస్తుందన్న
వివరాలు
ఇందులో
ఉన్నాయి.
ఈ
నెల
27
నుంచి
చర్లపల్లి-తిరువనంతపురం
నార్త్
అమృత్
భారత్
ఎక్స్
ప్రెస్
రైళ్ల
సమయాల్లో
మార్పులు
చోటు
చేసుకోనున్నాయి.
తాజా
షెడ్యూల్
ప్రకారం
చర్లపల్లిలో
ప్రతీ
మంగళవారం
ఉదయం
7.15కు
ఈ
రైలు
తిరువనంతపురానికి
బయలుదేరబోతోంది.
అక్కడి
నుంచి
8.37కు
నల్గొండలో,
9.06కు
మిర్యాలగూడలో,
11.39కి
సత్తెనపల్లిలో,
12.20కి
గుంటూరులో,
1.43కు
తెనాలిలో,
2.28కి
బాపట్లలో,
3.48కి
ఒంగోలులో,
5.23కి
నెల్లూరులో,
సాయంత్రం
7.20కి
రేణిగుంటలో
ఆగనుంది.
గమ్యస్ధానమైన
తిరువనంతపురానికి
మరుసటి
రోజు
మధ్యాహ్నం
2.45కు
చేరుతుంది.
అలాగే
తిరువనంతపురం
నార్త్
లో
ఈ
నెల
28న
బుధవారం
చర్లపల్లికి
అమృత్
భారత్
రైలు
మధ్యాహ్నం
2.45కు
బయలుదేరుతుంది.
అక్కడి
నుంచి
తమిళనాడు
మీదుగా
ఏపీలోకి
మరుసటి
రోజు
ఉదయం
ప్రవేశిస్తుంది.
ఉదయం
10.40కి
రేణిగుంటలో,
1.03కి
నెల్లూరులో,
2.43కి
ఒంగోలులో,
3.28కి
ఒంగోలులో,
4.43కి
తెనాలిలో,
5.40కి
గుంటూరులో,
6.59కి
సత్తెనపల్లిలో,
8.59కి
మిర్యాలగూడలో,
9.29కి
నల్గొండలో
ఆగుతుంది.
చివరికి
రాత్రి
11.30కి
చర్లపల్లికి
ఈ
రైలు
చేరుకుంటుంది.
ఈ
రైలు
రెండు
వైపులా
8
స్లీపర్
క్లాస్
కోచ్
లు,
11
జనరల్
సెకండ్
క్లాస్
కోచ్
లు,
1
ప్యాంట్రీ
కార్,
దివ్యాంగుల
కోసం
రెండు
సెకండ్
క్లాస్
కోచ్
లు
ఉంటాయి.
ఈ
రైలులో
ప్రయాణించే
వారి
కోసం
ఇప్పటికే
అడ్వాన్స్
టికెట్
బుకింగ్స్
ఆదివారమే
ప్రారంభమయ్యాయి.
దక్షిణాదిలోని
నాలుగు
రాష్ట్రాలను
కనెక్ట్
చేస్తూ
ప్రారంభించిన
ఈ
అమృత్
భారత్
రైలుకు
మంచి
ఆదరణ
లభిస్తుందని
రైల్వేశాఖ
అంచనా
వేస్తోంది.


