Andhra Pradesh
oi-Korivi Jayakumar
ఆంధ్రప్రదేశ్
(
ap
)
జలవనరుల
శాఖ
హంద్రీ-నీవా
ప్రాజెక్టు
ద్వారా
రాయలసీమ
జిల్లాలకు
రికార్డు
స్థాయిలో
నీటిని
తరలిస్తూ
చరిత్ర
సృష్టించింది.
తొలిసారిగా
ఈ
ప్రాజెక్టు
నుంచి
40.109
టీఎంసీల
నీటిని
డ్రా
చేయడం
ద్వారా
డిజైన్డ్
కెపాసిటీని
మించి
నీటి
తరలింపు
జరగడం
విశేషంగా
మారింది.
ప్రాజెక్టు
నిర్మాణం
పూర్తైనప్పటి
నుంచి
ఇంత
పెద్ద
మొత్తంలో
నీటిని
తరలించడం
ఇదే
తొలిసారి
కావడం
గమనార్హం.
190
రోజుల్లోనే
రికార్డు
స్థాయి
నీటి
తరలింపు..
మరో
కీలక
అంశం
ఏమిటంటే,
కేవలం
190
రోజుల్లోనే
ఈ
స్థాయిలో
నీటిని
రాయలసీమకు
చేరవేయడం.
ఇది
ఇరిగేషన్
శాఖ
పనితీరుకు
నిదర్శనంగా
నిలిచింది.
ఈ
ఘనతతో
సీమ
జిల్లాల
రైతాంగంలో
ఆనందం
వెల్లివిరిసింది.
సాగునీటి
లభ్యత
పెరగడంతో
పంటలపై
నమ్మకం
పెరిగిందని
రైతులు
పేర్కొంటున్నారు.
ఏపీ
(
ap
)
సీఎం
చంద్రబాబుకు
మంత్రుల
కృతజ్ఞతలు..
ఈ
సందర్భంగా
ఏపీలోని
(
ap
)
రాయలసీమ
జిల్లాలకు
చెందిన
మంత్రులు
పయ్యావుల
కేశవ్,
బీసీ
జనార్దన్
రెడ్డి,
అలాగే
రాయదుర్గం
ఎమ్మెల్యే
కాల్వ
శ్రీనివాసులు
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడును
కలిసి
కృతజ్ఞతలు
తెలిపారు.
హంద్రీ-నీవా
ద్వారా
ఈ
స్థాయిలో
నీరు
అందడం
వెనుక
టీడీపీ-కూటమి
ప్రభుత్వం
మరియు
సీఎం
చంద్రబాబు
దూరదృష్టి
కారణమని
వారు
స్పష్టం
చేశారు.
పంపుల
సామర్థ్యం
పెంపు
వల్లే..
గతంలో
హంద్రీ-నీవా
ప్రాజెక్టులో
కేవలం
ఒక
పంపు
ద్వారా
మాత్రమే
నీటిని
డ్రా
చేసే
పరిస్థితి
ఉండేదని..
టీడీపీ
ప్రభుత్వ
హయాంలో
6
పంపుల
సామర్థ్యానికి
విస్తరణ
చేపట్టారని
మంత్రి
పయ్యావుల
కేశవ్
గుర్తు
చేశారు.
అలాగే
కూటమి
ప్రభుత్వం
అధికారంలోకి
వచ్చిన
తర్వాత
ఈ
సామర్థ్యాన్ని
మరింత
పెంచి
12
పంపుల
వరకు
విస్తరించినట్లు
మంత్రి
కేశవ్
ముఖ్యమంత్రికి
వివరించారు.
ఈ
మార్పుల
వల్లే
రాయలసీమకు
నిరంతర
నీటి
సరఫరా
సాధ్యమైందని
మంత్రులు
తెలిపారు.
కాల్వల
విస్తరణలో
మరో
రికార్డు..
ఇక
హంద్రీ-నీవా
కాల్వల
వెడల్పు
పనులను
కేవలం
100
రోజుల్లో
పూర్తి
చేయడం
కూడా
ఒక
రికార్డేనని
మంత్రి
బీసీ
జనార్దన్
రెడ్డి
తెలిపారు.
వేగవంతమైన
పనుల
వల్ల
నీటి
ప్రవాహం
మరింత
మెరుగుపడిందని,
నష్టం
తగ్గి
రైతులకు
పూర్తి
ప్రయోజనం
అందుతోందని
ఆయన
అన్నారు.
మచ్చుమర్రి
ప్రాజెక్ట్
కీలక
మలుపు..
హంద్రీ-నీవా
ప్రాజెక్టులో
భాగమైన
మచ్చుమర్రి
ప్రాజెక్ట్
ఒక
గేమ్‌చేంజర్‌గా
మారిందని
ఇరిగేషన్
శాఖ
మంత్రి
నిమ్మల
రామానాయుడు
పేర్కొన్నారు.
మచ్చుమర్రి
నిర్మాణం
వల్లే
సీమకు
నీటిని
సమర్థవంతంగా
తరలించడంలో
సత్ఫలితాలు
సాధ్యమయ్యాయని
చెప్పారు.
ఈ
ప్రాజెక్టు
నిర్ణయం
అప్పట్లో
తీసుకోవడం
వల్లే
నేడు
రాయలసీమ
ప్రజలకు
ఈ
స్థాయిలో
నీరు
అందుతోందని
ఎమ్మెల్యే
కాల్వ
శ్రీనివాసులు
తెలిపారు.
ఈ
అన్ని
పనులు
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
నిరంతర
పర్యవేక్షణ,
పక్కా
ప్రణాళికతోనే
సాధ్యమయ్యాయని
మంత్రులు
స్పష్టం
చేశారు.
నీటి
నిర్వహణలో
దీర్ఘకాలిక
దృష్టితో
ముందుకు
సాగుతున్నట్లు
వారు
పేర్కొన్నారు.
ఇప్పటికే
40.109
టీఎంసీల
నీటిని
తరలించినా..
ఇక్కడితో
ఆగకూడదని,
50
టీఎంసీల
వరకు
నీటిని
హంద్రీ-నీవా
ద్వారా
సీమ
జిల్లాలకు
తరలించాలని
సీఎం
చంద్రబాబు
ఇరిగేషన్
శాఖకు
ఆదేశించారు.
అలాగే
రాయలసీమ
ప్రాంతంలోని
రిజర్వాయర్లు,
చెరువులు,
పూర్తిగా
నీటితో
నింపాలని
స్పష్టం
చేశారు.
అన్ని
చెరువులు,
రిజర్వాయర్లు
నిండినప్పుడే
నాకు
నిజమైన
సంతృప్తి”
అని
సీఎం
వ్యాఖ్యానించారు.
ఈ
లక్ష్యానికి
అనుగుణంగా
ఫిబ్రవరి
నెలాఖరు
లేదా
మార్చి
మొదటి
వారంలోగా
మరో
10
టీఎంసీల
నీటిని
తరలించి..
మొత్తం
50
టీఎంసీల
నీటి
తరలింపును
పూర్తి
చేస్తామని
మంత్రి
నిమ్మల
రామానాయుడు
ముఖ్యమంత్రికి
హామీ
ఇచ్చారు.
మొత్తానికి
హంద్రీ-నీవా
ప్రాజెక్టు
ద్వారా
సాధించిన
ఈ
రికార్డు
నీటి
తరలింపు
రాయలసీమకు
సాగునీటి
భరోసా,
రైతులకు
నమ్మకం,
ప్రాంత
అభివృద్ధికి
కొత్త
ఆశగా
నిలుస్తోంది.
భవిష్యత్తులో
మరింత
నీటిని
తరలిస్తూ
సీమను
సస్యశ్యామలం
చేయాలన్న
ప్రభుత్వ
లక్ష్యం
దిశగా
ఇది
కీలక
అడుగుగా
భావిస్తున్నారు.


