AP Cabinet: ఉగాదికి ఏపీ కేబినెట్ ప్రక్షాళన..! ఐదుగురికి ఛాన్స్? జనసేనకు మరో మంత్రి..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

ఏపీలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు (ap cabinet reshuffle) రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట ఇవాళ బాంబు పేల్చారు. అంతే కాదు కేబినెట్ లో భారీ మార్పులు తప్పవంటూ ఓ జాబితా కూడా విడుదల చేశారు.

రాష్ట్ర కేబినెట్ భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోందని ప్రవీణ్ పుల్లట వెల్లడించారు. ఈ మేరకు ప్రస్తుత మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయన్నారు. మెజారిటీ మంత్రులకు ఉద్వాసన తప్పదనే సంకేతాలు ఇచ్చారు. ఖచ్చితంగా కొత్త మంత్రివర్గంలోకి అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు వీరే అంటూ ఐదుగురు పేర్లు వెల్లడించారు. వీరిలో ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు జనసేన నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఉన్నారు.

కొంచెం అటు ఇటుగా లోకేశ్ టీమ్ తోనే కొత్త కేబినెట్ కూర్పు ఉంటుందని ప్రవీణ్ పుల్లట వెల్లడించారు. ఉగాదికి కాకపోయినా భారీ మార్పులతోనే కొత్త మంత్రివర్గం ఉంటుందన్నారు. మరోవైపు ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పల్లా శ్రీనివాసరావు స్థానంలో మంత్రుల్లో కొల్లు రవీంద్ర లేదా అనగాని సత్యప్రసాద్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ మంత్రులు ఎవరి స్ధానంలో కేబినెట్ లోకి రాబోతున్నారో మాత్రం ఆయన వెల్లడించలేదు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related