News
oi-Suravarapu Dileep
ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా ( EPFO ) నుంచి అత్యవసర సమయాల్లో నగదు విత్‌డ్రా (PF) చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇటీవలే ఈ విధానంలో అనేక మార్పులు చేశారు. నగదు పరిమితి పెంపుతోపాటు అనేక అదనపు ఆప్షన్ లను తీసుకొచ్చారు. ఉద్యోగులు తమ PF ఖాతా నుంచి సులభంగా నగదు విత్‌డ్రా చేసుకొనేందుకు వీలుగా ATM కార్డుల తరహా కార్డులను జారీ చేయాలని కేంద్ర కార్మిక శాఖ భావిస్తోంది.
అయితే ఈ విధానం ఈ సంవత్సరంలోనే అందుబాటులోకి వస్తుందని తొలుత కార్మిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశాయి. అయితే అనేక కారణాలతో ఈ నిర్ణయం అమలు వాయిదా పడింది. ఇటీవల నిర్వహించిన బోర్డు మీటింగ్ లో కొన్ని ప్రతిపాదనలు చేశారు.
కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు :
EPFO లక్ష్యానికి అనుగుణంగా తీసుకొచ్చిన ప్రతిపాదనలతో కొత్త నిర్ణయాన్ని అమలు చేయాలని భావించారు. అయితే ATM, UPI ద్వారా PF నగదు ఉపసంహరణ పై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. ABP న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వివరాలు వెల్లడించారు.
ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ? :
EPF నగదును ATM, UPI ద్వారా ఈ సంవత్సరం మార్చి నెలలోగా ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం విత్‌డ్రా కోసం అనేక వివరాలు అందించాల్సి వస్తోందని, ఈ విధానాన్ని సులభతరం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఈ సంవత్సరం అక్టోబర్ లో EPFO లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గరిష్ఠంగా 75 శాతం విత్‌డ్రా :
ఉద్యోగులు తమ భవిష్య నిధి ఖాతా నుంచి గరిష్ఠంగా 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. దీంతోపాటు గతంలో ఉన్న కాలపరిమితిలో కూడా మార్పులు చేసింది, 12 నెలల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు.. అనేక కేటగిరీల కింద నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఏదైనా కారణంగా ఉద్యోగాన్ని వదిలేస్తే.. సదరు వ్యక్తి గరిష్ఠంగా 75 శాతం PF నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మిగిలిన మొత్తాన్ని సంవత్సరం తర్వాత మాత్రమే తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 100 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
మూడు కేటగిరీలుగా :
ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా PF నగదు పాక్షిత విత్‌డ్రా కోసం మూడు కేటగిరీలుగా విభజన చేసింది. గృహ అవసరాలు, ముఖ్యమైన అవసరాలను ప్రత్యేక పరిస్థితులుగా విభజన చేసింది. విద్య, అనారోగ్య పరిస్థితులను ముఖ్యమైన అవసరాలు కేటగిరీలో చేర్చింది.
దీంతోపాటు విద్య, వివాహానికి సంబంధించిన విత్‌డ్రా పరిమితిని పెంచారు. విద్య కోసం గరిష్ఠంగా 10 సార్లు, వివాహానికి సంబందించి గరిష్ఠంగా 5 సార్లు విత్‌డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Best Mobiles in India
English summary
Union minister mansukh mandaviya key statement on PF withdrawals via ATM and UPI


