<!-- -->
ప్రయాణికులకు
శుభవార్త.
ఇకనుంచి
శంషాబాద్
టు
వైజాగ్‌కు
కేవలం
నాలుగు
గంటల్లోనే
చేరుకోవచ్చు.
సెమీ
హైస్పీడ్
రైల్
కారిడార్
ఎలైన్‌మెంట్
వచ్చేసింది.
ఈ
ట్రైన్
గంటలకు
220
కిలోమీటర్ల
వేగంతో
దూసుకెళ్లుతోంది.
సెమీ
హైస్పీడ్
ట్రైన్
విజయవాడ
మీదుగా
వైజాగ్
చేరుకుంటుంది.
ఈ
మార్గంలో
మొత్తం
పన్నెండు
స్టేషన్లు
ఉన్నట్లు
అధికారులు
చెబుతున్నారు.
సర్వే
చివరి
దశకు
చేరగా
నవంబర్‌లో
రైల్వేబోర్డుకు
సమర్పించనున్నారు.
దీంతో
పాటు
వైజాగ్
నుంచి
సూర్యపేట,
నల్గొండ,
కల్వకుర్తి,
నాగర్‌కర్నూల్
మీదుగా
కర్నూలుకు
మరో
కారిడార్‌ను
నిర్మించనున్నట్లు
అధికారులు
తెలిపారు.
220
కిలో
మీటర్ల
వేగంతో...
రెండు
తెలుగు
రాష్ట్రాల్లో
మొట్టమొదటి
సెమీ
హైస్పీడ్
కారిడార్
ఇదే
కావడం
విశేషం.
ఈ
రూట్‌లో
శంషాబాద్,
రాజమండ్రి
ఎయిర్
పోర్టులను
అనుసంధానించేలా
అధికారులు
ప్రణాళికలు
రూపొందిస్తున్నారు.
విమాన
ప్రయాణికులు
సెమీ
హైస్పీడ్
రైళ్లలో
స్వస్థలాలకు
త్వరతగతిన
చేరుకునేలా
రైల్వేశాఖ
అధికారులు
ప్రణాళికలు
వేస్తున్నారు.
గంటకు
220
కిలో
మీటర్ల
వేగంతో
ఈ
ట్రైన్స్
ప్రయాణించేలా
సెమీ
హైస్పీడ్
కారిడార్‌ను
ఏర్పాటు
చేస్తున్నారు.
ఈ
ప్రాజెక్టు
గనుక
పూర్తైతే..
శంషాబాద్
ఎయిర్‌పోర్టు
నుంచి
విశాఖపట్నానికి
కేవలం
నాలుగు
గంటల్లోపే
చేరుకునే
అవకాశం
ఉంటుంది.
ప్రస్తుతం
ఈ
రెండు
నగరాల
మధ్య
రైలు
ప్రయాణానికి
సుమారు
పన్నెండు
గంటల
సమయం
పడుతున్నట్లు
అధికారులు
చెబుతున్నారు.
అదే,
వందేభారత్
ఎక్స్‌ప్రెస్‌లో
అయితే,
8
గంటల
30
నిమిషాల్లో
చేరుకుంటున్నారు.
రెండు
మార్గాల్లో
..
సికింద్రాబాద్
నుంచి
వైజాగ్‌కు
ప్రస్తుతం
రెండు
మార్గాల్లో
ట్రైన్స్
నడుస్తున్నాయి.
మొదటిది
వరంగల్,
ఖమ్మం,
విజయవాడ
మార్గం
కాగా,
రెండోది
నల్గొండ,
గుంటూరు,
విజయవాడ
మార్గాల్లో
ప్రయాణిస్తోంది.
ఈ
రూట్లలో
ట్రైన్ల
గరిష్ఠ
వేగం
గంటకు
110-130
కిలోమీటర్లు
మాత్రమే
ఉంది.
ఈ
రెండింటితో
పోలిస్తే
ఇప్పడు
కొత్తగా
రానున్న
శంషాబాద్
టు
విశాఖపట్నం
మార్గం
ప్రయాణికులకు
మరింత
దగ్గరవుతుంది.
ఈ
మార్గంలో
ప్రయాణ
సమయం
సగానికంటే
తగ్గిపోతుందని
అధికారులు
చెబుతున్నారు. ...
<!-- -->
పర్యాటకులకు
తెలంగాణ
టూరిజం
శాఖ
ఓ
శుభవార్తను
అందించింది.
క్రూయిజ్
టూర్
ప్యాకేజీలకు
సంబంధించి
ఓ
కీలకమైన
సమచారాన్ని
అందించింది.
ఇందులో
భాగంగా
టూరిస్టుల
కోసం
ఒకేసారి
రెండు
ప్యాకేజీలను
అందుబాటులోకి
తీసుకొచ్చింది.
సోమశిల
టు
శ్రీశైలం,
సాగర్
టు
శ్రీశైలం
మధ్య
రెండు
టూర్
ప్యాకేజీలను
ఆపరేట్
చేయనుంది.
ఇందుకు
సంబంధించిన
పూర్తి
వివరాలను
ఓసారి
చూసేద్దాం..
వన్
వేతో
పాటు
రౌండ్
ట్రిప్
టూర్..
వారాంతంలో
హైదరాబాద్
నగరానికి
సమీపంలో
ఉండే
టూరిస్టు
ప్రాంతాలకు
వెళ్లాలనుకునేవారి
కోసం
తెలంగాణ
టూరిజం
ఒకటి
కాదు..
ఏకంగా
రెండు
ప్యాకేజీలను
ప్రకటించింది.
పట్టణానికి
దగ్గరగా
ఉండే
టూరిస్టు
స్పాట్‌లలో
ఒకటి
సోమశిల.
ఇది
తెలంగాణ
మినీ
మాల్దీవులుగా
పేరుగాంచింది.
ఇది
నగరానికి
సుమారు
200
కిలోమీటర్లలోపే
ఉంటుంది.
ఇక,
ఈ
ప్రాంతానికి
వెళ్లేందుకు
పర్యాటకులు
క్యూ
కడుతుంటారు.
ఇలాంటి
వారికోసమే
తెలంగాణ
టూరిజం
స్పెషల్
క్రూజ్
ఆఫర్
టూర్
ప్యాకేజీలను
అందుబాటులోకి
తీసుకొచ్చింది.
ఇందులో
సోమశిల
టు
శ్రీశైలం,
సాగర్
టు
శ్రీశైలం
మధ్య
క్రూయిజ్
ప్రయాణం
ఉంటుంది.
ఈ
ప్యాకేజీలో
భాగంగా
వన్
వేతో
పాటు
రౌండ్
ట్రిప్
టూర్‌ను
కూడా
పర్యాటకుల
కోసం
అందుబాటులోకి
తీసుకొచ్చారు.
అతి
తక్కువ
ధరకే...
సోమశిల
టు
శ్రీశైలం
టు
సోమశిలకు
ప్రయాణం
ఈ
నెల
(అక్టోబర్)
26న
ప్రారంభం
కానుంది.
దీంతోపాటు
నాగార్జున
సాగర్
-
శ్రీశైలం
-
నాగార్జున
సాగర్
మధ్య
కూడా
మరో
క్రూయిజ్
టూర్
ప్యాకేజీని
తెలంగాణ
టూరిజం
పర్యాటకుల
కోసం
తీసుకొచ్చింది.
ఈ
ప్యాకేజీ
నవంబర్
2న
పర్యాటకులకు
అందుబాటులో
ఉంటుంది.
ఇక
వీటి
ధరలను
ఓసారి
పరిశీలిస్తే..
వన్
వే
క్రూయిజ్
టూర్
ప్యాకేజీ
ధరల్లో
పెద్దలకు
రూ.
2
వేలు
చెల్లించాల్సింది.
అదే
పిల్లలకయితే
రూ.
1600గా
నిర్ణయించారు.
రౌండ్
క్రూయిజ్
టూర్
ప్యాకేజీ
ధరల్లో
పెద్దలకు
రూ.
3
వేలు
చెల్లించాల్సింది.
అదే
పిల్లలకు
రూ.
2,400గా
నిర్ణయించారు.
ఈ
ప్యాకేజీని
బుక్
చేసుకోవాలంటే
తెలంగాణ
టూరిజం
అధికారిక
వెబ్‌సైట్‌ను
https://tourism.telangana.gov.in/
సంప్రదించాల్సి
ఉంటుంది. ...
<!-- -->
ప్రయాణికులకు
ఏపీఎస్ఆర్టీసీ
ఓ
శుభవార్తను
అందించింది.
భక్తుల
కోసం
విజయనగరం
నుంచి
పంచారామాలకు
స్పెషల్
సర్వీసులను,
ప్యాకేజీలను
ప్రకటించింది.
ఈ
ప్యాకేజీలో
భాగంగా
భక్తులకు
ఐదు
ప్రముఖ
అధ్యాత్మిక
క్షేత్రాలను
సందర్శించే
అవకాశం
కల్పించింది.
ఈ
సర్వీసులకు
సంబందించిన
పూర్తి
వివరాలను
చూసేద్దాం..
విజయనగరం
నుంచి
ప్రతిష్టాత్మక
ఆధ్యాత్మిక
కేంద్రాలైన
పంచారామాల
దర్శనం
కోసం
ఏపీఎస్‌ఆర్టీసీ
స్పెషల్
బస్సు
సర్వీసులకు
భక్తుల
కోసం
అందుబాటులోకి
తీసుకొచ్చింది.
ఈ
సర్వీసులు
వచ్చే
(నవంబర్)
నెల
3,
10,
17,
24
తేదీల్లో
విజయనగరం
నుంచి
బయల్దేరుతాయి.
మరికొద్ది
రోజుల్లో
కార్తీక
మాసం
రాబోతుంది.
ఈ
సమయంలో
చాలామంది
వివిధ
పుణ్యక్షేత్రాలను
వెళ్లేందుకు
ఆసక్తి
కనబరుస్తారు.
అలాంటివారికోసమే
ఏపీఎస్ఆర్‌టిసీ
ఈ
నిర్ణయం
తీసుకుంది.
ఇందులో
భాగంగానే
పంచారామాలకు
వెళ్లేందుకు
ఆర్టీసీ
ప్రత్యేక
సర్వీసులు
నడుపుతున్నట్లు
విజయనగరం
జిల్లా
ప్రజా
రవాణా
అధికారి
సీహెచ్
అప్పలనారాయణ
పేర్కొన్నారు.
ప్రతి
ఆదివారం
బస్సులు
అందుబాటులో..
ఆర్టీసీ
అందిస్తోన్న
ఈ
ప్యాకేజీలో
భాగంగా
పంచారామాలైన
అమరావతి
లోని
అమరేశ్వరుని
దర్శనంతోపాటు,
పాలకొల్లు
క్షీరరామలింగేశ్వరుడు,
భీమవరంలోని
సోమేశ్వరుడు,
ద్రాక్షారామంలోని
భీమేశ్వరుడు,
సామర్లకోట
లోని
కొమర
లింగేశ్వరుడు
వంటి
పుణ్యక్షేత్రాలను
దర్శించుకోవచ్చు.
ఇందుకోసం
ఏపీఎస్ఆర్‌టిసి
సూపర్
లగ్జరీ,
అల్ట్రా
డీలక్స్,
ఎక్స్‌ప్రెస్
బస్సులు
ప్రత్యేకంగా
నడుపుతోంది.
ఇక,
ఈ
బస్సులు
ప్రతి
ఆదివారం
ప్రయాణికులకు
అందుబాటులో
ఉంటాయి.
నవంబర్
3,
10,
17,
24
తేదీల్లో
సాయంత్రం
4
గంటలకు
విజయనగరం
బస్
కాంప్లెక్స్
నుంచి
ఈ
బస్సులు
ప్రారంభమవుతాయి.
పంచారామాల
క్షేత్రాల
సందర్శన
తర్వాత
తిరిగి
మంగళవారం
తెల్లవారుజామున
విజయనరానికి
చేరుకుంటాయి.
ఛార్జీలివే..
ఈ
ప్యాకేజీలో
భాగంగావిజయనగరం
నుంచి
ఒక్కొక్కరికి
సూపర్
లగ్జరీకి
రూ.2
వేలు
ఛార్జ్
చేయగా,
అల్ట్రా
డీలక్స్‌కు
రూ.1,950
టికెట్
చార్జీగా
అధికారులు
నిర్ణయించారు.
ఈ
టికెట్లను
బుక్
చేసుకోవాలనుకునేవారు
ఏపీఎస్ఆర్టీసీ
ఆన్‌లైన్.ఇన్
వెబ్‌సైట్‌లో,
బుక్
చేసుకోవచ్చు.
లేదంటే
డిపోకౌంటర్లలో
బుక్
చేసుకునే
సదుపాయం
కలదు.
ప్రత్యేకంగా
బస్సును
బుక్
చేసుకునే
భక్తుల
కోసం
వారు
ప్రయాణించే
చోటుకు
బస్సు
పంపుతామని
విజయనగరం
జిల్లా
ప్రజా
రవాణా
అధికారి
పేర్కొన్నారు.. ...