Chandu Tilaru

31 POSTS

Exclusive articles:

ఈ నెల 25 వ‌ర‌కు జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలు మూసివేత‌…

<!-- --> నిన్న మొన్న‌టివ‌ర‌కు దేశంలో వ‌ర్షాలు దంచికొట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఇప్పుడు దానా తుఫాన్ బంగాళాఖాతం వైపు వేగంగా క‌దులుతున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. దానా తుఫాను ప్ర‌భావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై తీవ్రంగా ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అక్క‌డి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే లోతట్టు ప్రాంతాల నుంచి నివాసితులను ఖాళీ చేయించడం, విద్యా సంస్థలను మూసేయడం వంటి ప‌నులు చేస్తున్నారు. ఈ తుఫాను ప్ర‌భావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఉంటుంద‌ని స‌మ‌చారం. ఈ దానా తుఫాను ప్రభావం ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయ‌ని, ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఈ విష‌యంపై అక్కడి ప్రభుత్వాలు కూడా అప్రమత్తమ‌య్యాయి. దానా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బందిని అధికారులు అలర్ట్ చేశారు. ఇక ఇక్క‌డి స్కూళ్లకు కూడా నాలుగురోజుల పాటు సెలవులు ప్రకటించాయి. ఈ ఆల‌యాలు మూసివేత‌.. 'దానా' తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపై పడనున్న‌ట్లు అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆలయాలైన జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలను కూడా మూసివేయ‌నన్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ఆర్డర్ ప్రస్తుతం ఈ నెల (అక్టోబర్) 25వ తేది వరకు అమలులో ఉండనుంద‌ని అధికారులు వివ‌రించారు. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి నిర్ణంయం తీసుకుంటారు. ఆ తర్వాత ఆలయాలు తెర‌వ‌లా వ‌ద్ద అనే నిర్ణయం ప్ర‌భుత్వం తీసుకోనుంది. ప‌లు మ్యూజియంలు కూడా మూసివేత‌.. ఒడిశా రాష్ట్రంలోని పూరీ లో వెల‌సిన ఈ ఆలయాలను సంద‌ర్శించకునేందుకు నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా వ‌స్తుంటారు. జగన్నాథ దేవాలయం, కోణార్క్ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా పేరుగాంచాయి. ఇక్క‌డికి ప్రతిరోజు భారతదేశంతో సహా ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు వస్తుంటారు. తుఫాను సంభవించినప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ రెండు ఆలయాలను ఈ నెల 25వ తేది వరకు మూసివేసిన‌ట్లు తెలిపింది. ఈ దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు కూడా మూసివేశారు. ...

భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. శ్రీ‌శైలంలో కార్తీక మాసోత్సవాల సంద‌ర్భంగా ఆ అభిషేకాలు ర‌ద్దు..

<!-- --> ఏపీలో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక‌టి నంద్యాల జిల్లాలోని శ్రీ‌శైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో ఇటీవ‌లే శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. ఇక్క‌డికి నిత్యం భక్తులు బారులు తీరుతుంటారు. ఇప్ప‌డు ఆల‌యంలో కార్తీక మాసోత్స‌వాల‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. శ్రీశైలం క్షేత్రంలో న‌వంబ‌ర్ 2వ తేదినుంచి డిసెంబ‌ర్ 1వ తేది వ‌ర‌కు కార్తీక మాసోత్స‌వాలు జ‌రగ‌నున్నాయి. ఈ మేర‌కు నేటి ఉద‌యం మాసోత్స‌వాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆల‌య ఈవో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మీడియాకు వివ‌రించారు. కార్తీక మాసోత్స‌వాల్లో భాగంగా ఆలయంలో జ‌రిగే గర్భాలయ అభిషేకాలను పూర్తిగా నిలుపుదల చేస్తున్న‌ట్లు తెలియజేశారు. ఆ ద‌ర్శ‌నానికి మాత్ర‌మే అనుమ‌తి.. శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రంలోని స్వామివారిని భ‌క్తులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు. ఇక‌, పండుగ‌లు, ఉత్స‌వాల స‌మ‌యంలో ఈ ఆల‌యం మ‌రింత ర‌ద్దీగా ఉంటుంది. కార్తీక మాసోత్స‌వాల వేల ఈ ఆల‌యం భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతుంది. మాసోత్స‌వాల్లో భాగంగా ఆల‌యంలో ప‌లు కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. శని, ఆది, సోమవారం కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే భ‌క్తుల‌కు అనుమతి ఉంటుందని ఆల‌య ఈవో పేర్కొన్నారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలు చేసుకోవ‌చ్చ‌ని ఆల‌య అధికారులు తెలిపారు. గ‌ర్భాల‌య అభిషేకాల‌ను మాత్రం పూర్తిగా నిలుపుద‌ల చేస్తున్న‌ట్లు అధికారులు వివ‌రించారు. కార్తీక పౌర్ణమి వేళ‌... ఆల‌య‌ రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసిన‌ట్లు తెలిపారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో కొనసాగింపు ఉంటుందని ఆల‌య అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో కార్తీక దీపారాధన చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వ‌చ్చే నెల (నవంబర్) 15 వ తేదిన కార్తీక పౌర్ణమి కావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం కార్యక్రమం ఉంటుందని ఆల‌య ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్ల‌డించారు. ...

దేశంలోనే అతిపెద్ద ఈవెంట్ అమ‌రావ‌తిలో.. 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో

<!-- --> అమ‌రావ‌తిలో నేడు, రేపు అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. ఐదువేల‌కు పైగా డ్రోన్ల‌తో మెగా షోను ఏపీ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌- 2024 పేరుతో పున్న‌మి ఘాట్ వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం అధికారులు అన్నీర‌కాల ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో జ‌రిగే ఈ డ్రోన్ సమ్మెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించ‌నున్నారు. ఈ డ్రోన్ స‌మ్మిట్ గురించిన పూర్తి వివ‌రాలను ఇప్ప‌డు తెలుసుకుందాం. డ్రోన్ సమ్మిట్.. ఇందులో భాగంగానే నేడు, రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొనసాగనుంది. ఇక‌, ఈ అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ -2024లో వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతిభద్రతలు, తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం విధాన రూపకల్పనపై దృష్టి పెట్టనున్నారు. డ్రోన్ సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ కృష్ణా తీరంలో రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో అత్యధికంగా రెండువేల డ్రోన్స్ తో డ్రోన్ షో నిర్వహించారు. అయితే, ఏపీ ప్రభుత్వం అంతకు మించి డ్రోన్స్ తో మెగాషో నిర్వహించి రికార్డు సృష్టించాలనే ఆలోచ‌న చేస్తోంది. అందుకోస‌మే కార్యక్రమాలు, డ్రోన్ హ్యాకథాన్, ఐదువేలకుపైగా డ్రోన్స్ తో డ్రోన్ షో జ‌ర‌గబోతుంది. ఐదు ప్రాంతాల్లో డిజిట‌ల్ తెర‌లు.. ఈ డ్రోన్ షో స‌మ్మిట్ మొత్తం తొమ్మిది థీమ్స్‌పై జ‌ర‌గ‌నుంది. ఇందులో సుమారు 400కిపైగా కంపెనీలు పాల్గొన‌బోతున్నాయి. మొత్తం 1800మంది డెలిగేట్స్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారు. ఇందుకోసం నాలుగు కేట‌గిరీల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్లు కూడా చేశారు. ఇందులో విజేతలుగా గెలిచిన‌వారికి కేటగిరీల వారీగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారు. నేటి సాయంత్రం 6 గంట‌ల నుంచి 8 గంటల వరకు ఈ డ్రోన్ షో జ‌ర‌గ‌నుంది. విజ‌య‌వాడ న‌గ‌ర‌వాసులంతా తిల‌కించేందుకు వీలుగా అధికారులు న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు చేస్తోన్నారు. అందుకోసం న‌గ‌రంలోని ఐదు ప్రాంతాల్లో భారీ డిజిట‌ల్ తెర‌లను కూడా సిద్ధంచేశారు. ఆ ప్రాంతాలు.. బెంజిస‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌, ప్రకాశం బ్యారేజీలు. ఇక‌, ఈ డ్రోన్ స‌మ్మిట్ ఏర్పాట్లలో భాగంగా అధికారులు మొత్తం 300 మంది సిబ్బందుల‌ను నియ‌మించారు. 10 మంది డిప్యూటీ క‌లెక్టర్లకు ప్రత్యేక బాధ్యత‌లు కూడా అప్పగించారు. ...

త్వ‌ర‌లో హైద‌రాబాద్ -వ‌రంగ‌ల్ మ‌ధ్య న‌డ‌వునున్న ఎల‌క్ట్రిక్ బ‌స్సులు..

<!-- --> ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్‌టీసీ ఓ శుభవార్త‌ను అందించింది. హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్‌కు త్వ‌ర‌లో 82 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా విస్తరిస్తోంది వరంగల్‌. ఇక‌, ఈ ప‌ట్ట‌ణానికి ఆర్‌టీసీ భారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించారు. త్వరలోనే ఈ బస్సులు రాకపోకలు సాగించ‌నున్నాయి. ఈ 82 ఎల‌క్ర్టిక్ బ‌స్సులను దశలవారీగా న‌డ‌ప‌నున్నారు. వరంగల్‌-హైదరాబాద్‌ మధ్య న‌డిచే ఈ బ‌స్సుల్లో ఎలక్ట్రిక్‌ సూపర్‌ లగ్జరీ 18 ఉండ‌గా, డీలక్స్ బ‌స్సులు 14, సెమీ డీలక్స్ బ‌స్సులు 21, ఎక్స్‌ప్రెస్ బ‌స్సులు 29 ఉన్నాయి. జేబీఎం సంస్థ.. ఇక‌, ఈ ఎల‌క్ర్టిక్ బ‌స్సుల‌ను ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొద‌టిసారి ఒలెక్ట్రా కంపెనీ బ్యాటరీ బస్సులను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంస్థ రెండు పర్యాయాలు బస్సులను సరఫరా చేసింది. అయితే, మూడో ప్రయత్నంలో మాత్రం ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ ఈ టెండర్‌ దక్కించుకుంది. ఇప్ప‌డు కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో 82 ఎల‌క్ర్టిక్ బ‌స్సుల‌ను న‌డుపనున్నారు. అయితే, ఇటీవ‌లే ఆర్‌టీసీ కొన్ని ఎలక్ట్రిక్ బ‌స్సుల‌ను క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ నుంచి ప్రారంభించింది. కానీ, రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద న‌గ‌రంగా విస్త‌రిస్తోన్న వ‌రంగ‌ల్‌కు ఎక్కువ బ‌స్సులు కేటాయించారు. 82 ఎల‌క్ట్రిక్ బస్సులు.. వ‌రంగ‌ల్ జనాభా, విస్తీర్ణం పరంగా పెద్ద పట్టణంగా మారింది. అందుకే వరంగల్‌కు ఎక్కువ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 82 ఎల‌క్ట్రిక్ బస్సులను కేటాయించారు. వీటిని వరంగల్‌-2 డిపో ఆధ్వర్యంలో నడపనున్నారు. హైదరాబాద్ టు వరంగల్‌ మధ్య బస్సులు ఎక్కువగా న‌డుస్తాయి. నిత్యం ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే రెండు ప్రాంతాల మధ్య అదనంగా కొత్త బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. జేబీఎం సంస్థ బ‌స్సుల‌ను సరఫరా చేసేవరకు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతున్నారు. ...

ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ప‌లు ఎక్స్‌ప్రెస్ రైళ్ల స‌మ‌యాల్లో మార్పులు..

<!-- --> ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప‌లు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల స‌మయాల వేళ‌ల‌ను మార్చింది. ఈ విష‌యాన్ని ప్ర‌యాణికులు గ‌మ‌నించ‌వ‌ల‌సిందిగా రైల్వేశాఖ కోరింది. మూడు రైళ్ల ప్రయాణ స‌మ‌య‌వేళ‌ల‌ను మార్చిన‌ట్లు దక్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. ఇందులో లింగ‌ంప‌ల్లి టు తిరుప‌తి వ‌ర‌కు ప్ర‌యాణించే నారాయ‌ణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ టు తిరుప‌తి వ‌రకు ప్రయాణించే ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్ టు గూడురు ప్ర‌యాణించే సింహాపురి ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ వేళ‌ల‌ను మార్చిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక‌, ఈ మార్పును గ‌మ‌నించాలని ప్రయాణికులను కోరింది. వీటి పూర్తి వివ‌రాల‌ను ఓసారి చూద్దాం.. నారాయ‌ణాద్రి ఎక్స్‌ప్రెస్ .. 12734 అనే నెంబ‌ర్‌గ‌ల లింగ‌ంప‌ల్లి నుంచి తిరుప‌తి వ‌ర‌కు ప్ర‌యాణించే నారాయ‌ణాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రయాణించే వేళ‌ల్లో ప‌లు మార్పులు చేశారు. ఈ ట్రైన్ లింగ‌ంప‌ల్లిలో సాయంత్రం 5.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, సికింద్రాబాద్ స్టేష‌న్‌కు కు సాయంత్రం 6.05 గంట‌ల‌కు చేరుకుంటుంది. అక్క‌డి నుండి న‌డికుడిరి రాత్రి 8.34 గంట‌ల‌కు, పిడుగురాళ్లకు రాత్రి 8.54 గంట‌ల‌కు, స‌త్తెన‌ప‌ల్లికి రాత్రి 9.22 గంట‌ల‌కు, గుంటూరుకు రాత్రి 10.55 గంట‌ల‌కు చేరుకుంటుంది. తెనాలికి రాత్రి 11.38 గంట‌ల‌కు చేరుకోగా, బాప‌ట్ల స్టేష‌న్‌కు అర్ధరాత్రి 12.14 గంట‌ల‌కు చేరుకుంటుంది. అదే చీరాలక‌యితే అర్ధరాత్రి 12.29 గంట‌ల‌కు, ఒంగోలుకు అర్ధరాత్రి 1.13 గంట‌ల‌కు, సింగ‌రాయ‌కొండకు అర్ధరాత్రి 1.34 గంట‌ల‌కు, కావ‌లికి అర్ధరాత్రి 2.04 గంట‌ల‌కు, నెల్లూరుకు అర్ధరాత్రి 2.28 గంట‌ల‌కు చేరుకుంటుంది. గూడురుకు తెల్లవారుజామున 3.34 గంట‌ల‌కు, వెంక‌ట‌గిరికి తెల్లవారుజామున 4.18 గంట‌ల‌కు, శ్రీ‌కాళ‌హ‌స్తికి తెల్లవారుజామున 4.38 గంట‌ల‌కు, రేణిగుంటకు తెల్లవారుజామున 5.08 గంట‌ల‌కు, తిరుప‌తి స్టేష‌న్‌కు ఉదయం 5.55 గంట‌ల‌కు చేరుకుంటుంది. ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్... ఇక‌, 12764 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు తిరుప‌తి ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రయాణించే వేళ‌ల్లో కూడా మార్పులు చేశారు. ఈ ట్రైన్ తెల్లవారుజామున 4.19 గంట‌ల‌కు గూడురుకు, ఆ త‌ర్వాత ఉద‌యం 5.09 గంట‌ల‌కు వెంక‌ట‌గిరికి, శ్రీ‌కాళ‌హ‌స్తి ఉద‌యం న 5.29 గంట‌ల‌కు చేరుకుంటుంది. ఉద‌యం 5.58 గంట‌ల‌కు రేణిగుంటకు, తిరుప‌తి స్టేష‌న్‌కు ఉద‌యం 6.55 గంట‌ల‌కు చేరుకుంటుంది. ఆ ర‌కంగా స‌మ‌య‌వేళల్లో మార్పులు తీసుకొచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ టు గూడురు మ‌ధ్య ఎటువంటి మార్పు లేద‌ని సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారులు వివ‌రించారు. ...

Breaking

Rapper Wins Lawsuit From Cops Over Music Videos

Afroman won a jury verdict Wednesday (March 18) clearing...

Lorde’s ‘Royals’ Joins Billion Views Club

She may not be a royal, but her breakthrough...

Clipse, Mavis Staples & More Are 2026 Libera Awards Nominees: List

Best Alternative Rock Record The Beths – Straight Line Was...

This Stylish Flat in Avignon, France, Kept Me Cozy During the Offseason

Traveling during the mistral is no easy feat. The...
spot_imgspot_img